ప్రియుడితో 15 రోజులు, భర్తతో 15 రోజులు గడిపేలా అవకాశం ఇవ్వండి: దండం పెట్టిన పెద్దలు
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాహిత మహిళ ఒకరు తన భర్తతో 15 రోజులు, ప్రియుడితో 15 రోజులు ఉంటానని పంచాయతీలో చేసిన ప్రతిపాదన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకుముందు ఏకంగా 10 సార్లు ఆమె తన ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించి, రెడ్ హ్యాండెడ్ గా దొరకడం హైలైట్.
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాండా అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర కిందట ఆమెకు పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమెకు తన స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ సంబంధం ఏర్పడింది.

పెళ్లయిన ఆరు నెలలకే ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. అప్పట్లోనే ఈ వ్యవహారం పంచాయతీ పెద్దల ముందుకు వచ్చింది. వాళ్లు జోక్యం చేసుకుని, ఆమెకు నచ్చజెప్పారు. అయినప్పటికీ- ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పెళ్లయిన ఈ ఏడాదిన్నర కాలంలో 10 సార్లు ప్రియుడితో కలిసి పారిపోయింది.
దీంతో వారం రోజుల కిందట ఆమె భర్త అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవంక- ఈ వ్యవహారంలో పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఆమె రోజూ భర్తతో గొడవపడుతోండటంతో సర్దిచెప్పడానికి పంచాయతీ ఏర్పాటు చేశారు.
రాంపూర్ లో ఉన్న ఈ ఇద్దరినీ టాండా గ్రామానికి తీసుకొచ్చారు పోలీసులు. కౌన్సెలింగ్ ఇచ్చారు. పంచాయతీ పెద్దల సమక్షంలోనే భార్యభర్తను కలిపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆమె ఓ వింత ప్రతిపాదన వారి ముందు ఉంచింది. భర్తతో సక్రమంగా కాపురం చేసుకోవడానికి కొన్ని కండీషన్లు పెట్టింది.
నెలకు 15 రోజులు భర్తతో, 15 రోజులు ప్రేమికుడితో కలిసి ఉంటానని, దీనికి అంగీకరిస్తేనే పెద్దలు చెప్పింది వింటాననే తెగేసి చెప్పింది. అది వినగానే భర్తతో సహా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఆమె ప్రతిపాదన విని, భర్త, పంచాయతీ పెద్దలు దండం పెట్టారు. చివరికి చేసేది లేక ప్రియుడితో ఉండేలా తీర్మానించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications