ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ ను చెప్పుతో కొట్టిన మహిళ, కాలర్ పట్టుకుని ?

రోగి బంధువులను దుర్భాషలాడారనే ఆరోపణల నేపథ్యంలో చిక్కమగళూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్‌ నిపుణుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టడమే కాకుండా అతని కాలర్ పట్టుకున్న బయటకు లాగిన ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలోని ప్రభుత్వ మల్లగౌడ జిల్లా ఆసుపత్రిలో ఓ రోగి సోదరి అదే ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ ను అందరి ముందు చెప్పుతో కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తనను దుర్భాషలాడాడని ఆర్థోపెడిక్ నిపుణుడు, సీనియర్ వైద్యుడు వెంకటేష్‌పై రోగి అక్క చెప్పుతో దాడి చేసిందని ఆరోపిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు దిగడంతో పరిస్థితి చెయ్యిదాటింది జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించారు. ప్రభుత్వ డాక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ఓపీడీని మూసివేసి మాకు తగిన రక్షణ కల్పించాలని ఆసుపత్రి సిబ్బంది జిల్లా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.

A woman slapped a senior doctor in front of everyone in the district hospital

జిల్లా ఆసుపత్రి వైద్యుడిపై ఓ మహిళ చెప్పుతో దాడి చేయడంతో ఆ దాడికి నిరసనగా ఆసుపత్రి సిబ్బంది నిరసన తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థోపెడిక్ నిపుణుడు వెంకటేష్ చొక్కా పట్టుకుని మహిళ మెడ పట్టి బయటకు లాగడంతో రెండు వర్గాల మధ్య గొడవ జరడంతో ఆసుపత్రిలోని సాటి రోగులు భయంతో హడలిపోయారు. రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఆ దాడిలో ఓ యువకుడికి గాయాలైనాయి.

తరువాత ఆ యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడికి వైద్యం అందిస్తుండగా పేషెంట్ అక్క నీళ్ల బాటిల్ ఇచ్చేందుకు అక్కడికి వెళ్లింది. ఆ సందర్బంలో డాక్టర్ వెంకటేష్ పేషెంట్ అక్కను పురుష పదజాలంతో దూషించాడనే ఆరోపణలున్నాయి. దీంతో ఆగ్రహించిన రోగి అక్క డాక్టర్‌ వెంకటేష్ పై చెప్పుతో దాడి చేసింది.వైద్యుడిపై దాడిని ఆసుపత్రి సిబ్బంది ఖండించారు. మరియు జిల్లా ఆసుపత్రి సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఆసుపత్రి వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యుడిపై దాడిని ఖండిస్తూ జిల్లా ఆస్పత్రి సర్జన్ మోహన్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సరిపడా పోలీసులు లేకపోవడమే ఇలాంటి ఘటలనకు కారణం అవుతున్నాయని ఆసుపత్రి సిబ్బంది ఆరోపించారు. జిల్లా ఆసుపత్రిలో ఎక్కువ మంది పోలీసులను నియమించాలని ఆసుపత్రి సిబ్బంది జిల్లా ఎస్పీని కోరారు. పోలీసు అధికారులు ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించి చర్చలు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+