పిల్లను ఇవ్వడం లేదు, ఈజన్మలో పెళ్లికాదని యువకుడు ఏం చేశాడంటే !

బెంగళూరు/మంగళూరు: ఈకాలంలో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే పెళ్లికొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడా, ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అని అమ్మాయిల కటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. వ్యవసాయం చేసే యువకులకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

వ్యవసాయం, మెట్ట ప్రాంతాలపై భూములు ఉండి వ్యవసాయం మీద ఆధారపడుతున్న కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని యువకులకు గత కొన్నేళ్లుగా ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎంతోకాలం నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నా తనకు పెళ్లి కాలేదని ఆవేదన చెందిన యల్లాపూర్‌లో నివాసం ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

suicide

యల్లాపూర్ తెలంగార కిరగారిమనేలో నివాసం ఉంటున్న నాగరాజ గణపతి గాంకర్ అలియాస్ నాగరాజ (35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు. యల్లాపూర్‌లోని తెలంగార కిరగారి ప్రాంతంలో నాగరాజ అతని సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.. సొంత పొలం కావడంతో నాగరాజ్ కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు.

చాలా సంవత్సరాల నుంచి నాగరాజ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బంధువులు, స్నేహితులు చూసిన పెళ్లి సంబంధాల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నాగరాజ పెళ్లిచూపులకు వెలుతున్నాడు. అయితే నాగరాజ వ్యవసాయం చేస్తున్నాడని, అతని పొలాలు అన్ని మెట్ట ప్రాంతాల్లో ఉన్నాయనని తెలుసుకున్న అమ్మాయిల కుటుంబ సభ్యులు అతనికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు.

పదేపదే పెళ్లి చూపులకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నాగరాజకు ఎక్కడా పెళ్లి సెట్ కాలేదు. నీకు ఈజన్మలో పెళ్లికాదని అతని స్నేహితులు ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా తనకు పెళ్లికాలేదనే ఆవేదన చెందిన నాగరాజ ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతపొలాలు ఉన్నా పెళ్లికాలేదని నాగరాజ ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+