లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దేశం మొత్తం లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు కొన్ని పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
కర్ణాటకలోని హుబ్బళి-ధారవాడ జంట నగరాల్లో పట్టపగలు కాలేజ్ క్యాంపస్ లో నేహా అనే విద్యార్థి హత్యకు గురి కావడంతో కర్ణాటకలో ఇప్పటికీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగిక కొన్ని రోజులకే పాఠశాలలో గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడంటూ ఆ లేడీ టీచర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ధారవాడలో చోటుచేసుకుంది.

తన కూతురిని ఓ యువకుడు అపహరించాడని ఆరోపిస్తూ ధారవాడ జిల్లా కుందగోళ తాలూకాలోని గూడగేరి పోలీస్ స్టేషన్‌ను గెస్ట్ టీచర్ తండ్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న తన కూతురి ఆచూకి కనిపెట్టాలని ఆమె తండ్ర పోలీసులకు మనవి చేశారు. హుబ్బళి-ధారవాడ ప్రాంతంలోనే వారం రోజులు పూర్తి కాకముందే కాలేజ్ అమ్మాయి హత్యకు గురి కావడం, మరో అమ్మాయి కిడ్నాప్ కావడం కలకలం రేపింది.
గుడిగేరి తాలూకాలోని కలస గ్రామానికి చెందిన లేడీ టీచర్ అపహరణకు గురైయ్యింది. హావేరి జిల్లా అలదకట్టి గ్రామానికి చెందిన సుబానీ అనే యువకుడు లేడీ టీచర్ ను కిడ్నాప్ చేశాడని ఉపాధ్యాయురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కిడ్నాప్ కేసులో ఇచ్చిన ఫిర్యాదు సమాచారం మేరకు ఏప్రిల్ 18వ తేదీన లేడీ టీచర్ ను ఓ యువకుడు దురుద్దేశంతో కిడ్నాప్ చేశాడని, తన కూతురికి ప్రాణహాని ఉందని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు.

కలస గ్రామంలోని అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని చెప్పిన లేడీ టీచర్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమె తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు చర్యలు తీసుకున్నారు. జాతరకు వెళ్లిన లేడీ టీచర్ ఎక్కడికి వెళ్లింది?, ఆమెను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు ఎక్కడ ఉన్నాడు, ఇన్ని రోజులు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడానికి కారణం ఏమిటి? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. లేడీ టీచర్ కిడ్నాప్ కేసులో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు అతని స్నేహితులును విచారిస్తున్నారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications