Girl: పెళ్లి ఫిక్స్, ఉద్యోగం మానేసింది, పట్టపగలు యువతి దారుణ హత్య, ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా ?

బెంగళూరు/దావణగెరె: బాగా చదువుకున్న యువతి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. యువతి ఉద్యోగం చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆమె ఓ ప్రముఖ అకౌంటెంట్ దగ్గర ఉద్యోగం చేస్తున్నది. ఇంతకాలం ఆమె సంతోషంగా ఉద్యోగానికి వెళ్లి వచ్చింది. ఇటీవల బంధువులు చూసిన అబ్బాయితో యువతి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో పెద్దలు ఇటీవల ఆమె పెళ్లి నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థం జరిగిన తరువాత ఆమె ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నది. నిశ్చితార్థం జరిగిన అమ్మాయి దారుణ హత్యకు గురైయ్యింది.

ఉద్యోగం చేస్తున్న యువతి

ఉద్యోగం చేస్తున్న యువతి

కర్ణాటకలోని దావణగెరెలోని వినోభనగర్ లో మోహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ ముస్తఫాకు చాంద్ సుల్తానా అలియాస్ చాంద్ (28) అనే కుమార్తె ఉంది. దావణగెరెలోని ప్రముఖ అకౌంటెంట్ దగ్గర చాంద్ సుల్తానా ఆయనకు అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నది. చాంద్ సుల్తానాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

పెళ్లి ఫిక్స్.... ఉద్యోగానికి గుడ్ బై

పెళ్లి ఫిక్స్.... ఉద్యోగానికి గుడ్ బై

హరిహరలో నివాసం ఉంటున్న అయూబ్ అనే యువడి పెళ్లి సంబంధం కుదిరింది. బంధువులు చూసిన అయూబ్ ను పెళ్లి చేసుకోవడానికి చాంద్ సుల్తానా అంగీకరించిందని తెలిసింది. చాంద్ సుల్తానా. అయూబ్ ల పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి డేట్ ఫిక్స్ కావడంతో చాంద్ సుల్తానా ఉద్యోగం మానేసింది.

కత్తితో పొడిచి దారుణ హత్య

కత్తితో పొడిచి దారుణ హత్య

నిశ్చితార్థం జరిగిపోయిన చాంద్ సుల్తానా గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సందర్బంలో దావణగెరెలోని పీజే లేఔట్ లో చాంద్ సుల్తానాను ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న చాంద్ సుల్తానా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హడలిపోయారు.

వాడి పనేనా ?, లేక ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా

వాడి పనేనా ?, లేక ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా

చాంద్ సుల్తానాను ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడని, అతనే హత్య చేసి ఉంటాడని దావణగెరె పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ యువకుడే చాంద్ సుల్తానాను హత్య చేశాడా ? లేక ఏమైనా కారణాలు ఉన్నాయా, చాంద్ సుల్తానాకు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా కాపురం చెయ్యడానికి సిద్దం అవుతున్న చాంద్ సుల్తానా పట్టపగలు హత్యకు గురి కావడం దావణగెరెలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+