girl: హైవేలో కాలేజ్ అమ్మాయికి చెంపదెబ్బ కొట్టి వెంటనే తాళి కట్టేశాడు. యూనీఫామ్ లో !

బెంగళూరు/మండ్యా: ప్రేమికుల రోజు, లవర్స్ డేకి ముందు, తరువాత ప్రేమికులు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధరణంగా జరుగుతుంటాయి, దేవాలయాలు, స్నేహితుల సమక్షంలో లవర్స్ లవ్ మ్యారేజ్ లు చేసుకుంటారు. ప్రేమికుల రోజు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని, పెళ్లి రోజు అందరికి గుర్తుండాలని చాలా మంది కలలుకంటుంటారు. కాలేజ్ అమ్మాయి యూనీఫామ్ లో ఉన్న సమయంలోనే హైవే రోడ్డు మీద ఆమెకు తాళి కట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే నడిరోడ్డులో కాలేజ్ అమ్మాయి మెడలో ఓ యువకుడు తాళి కట్టిన వీడియో హాట్ టాపిక్ అయ్యింది. మండ్యాలో ఓ యువతి కాలేజ్ లో చదువుతోంది. ప్రతిరోజు ఆమె కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఎప్పటిలాగే ఆమె కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ నుంచి ఆమె బయటకు వచ్చింది. బెంగళూరు- మైసూరు హైవే రోడ్డు మీద కాలేజ్ అమ్మాయి నడుచుకుంటూ వెలుతోంది.

A young man tied a mangalsutra around the neck of a college girl on the highway in Mandya, the video went viral

హై రోడ్డు మీద వాహన సంచారం ఎక్కువగానే ఉంది. ఆ సందర్బంలో యువతి ముందు ఓ యువకుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తరువాత ఆ యువకుడు కాలేజ్ అమ్మాయిని చెంపదెబ్బ కొట్టాడు. యువతి చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయి అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించింది.

తరువాత ఆ యువకుడు జోబులో ఉన్న తాళి తీసుకుని బెంగళూరు-మైసూరు హైవే రహదారి పక్కనే ఆమె మెడలో తాళికట్టేశాడు. ఈ తంతంగా మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో వైరల్ అయ్యింది. కాలేజ్ అమ్మాయి యూనీఫామ్ వేసుకుందని, ఆమె మెడలో కాలేజ్ ఐడీ కార్డు ఉందని వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. అయితే మండ్యాలో ఈ విషయంలో ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద నడిరోడ్డులో కాలేజ్ అమ్మాయి మెడలో ఓ యువకుడు తాళి కట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+