వేగంగా వెలుతున్న రైలులో నుంచి నదిలో దూకేసిన యువతి, బెంగళూరులో ఉద్యోగం !
యువతి కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా జీవనం సాగించింది. ఉద్యోగం చెయ్యడానికి సిటీకి వెలుతున్నానని యువతి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. ఐటీ హబ్ చేరుకున్న యువతి ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నది. ప్రతిరోజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్న యువతి సంతోషంగానే ఉందని తెలిసింది. అయితే రైలులో నుంచి నదిలో దూకిన యువతి ఆత్మహత్య చేసుకుంది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని మధుగురి పట్టణంలో నయనా అలియాస్ నయని (27) అనే యువతి నివాసం ఉంటున్నది. ఉద్యోగం చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన నయన రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో నయన ఉద్యోగంలో చేరింది. కొంతకాలం ఆ కంపెనీలో ఉద్యోగం చేసిన నయన తరువాత ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరి అక్కడ ఉద్యోగం చేసిందని తెలిసింది.

బెంగళూరులో నివాసం ఉంటున్న నయన సెలవులు, పండుగలకు మధుగిరి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడుపుతున్నదని తెలిసింది. నెలలో రెండు ఆదివారాలు కుటుంబ సభ్యులతో గడుపుతున్న నయన ఆదివారం సాయంత్రం కాని, లేదా సోమవారం ఉదయం కాని మళ్లీ బెంగళూరు చేరుకుని ఉద్యోగం చెయ్యడానికి వెళ్లేదని తెలిసింది.
బెంగళూరు నుంచి మంగళూరు వెలుతున్న రైలు ఎక్కిన నయన తరువాత రైలులో కుర్చుంది. రైలు దక్షిణ కన్నడ జిల్లలో వేగంగా వెలుతోంది. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళ తాలుకాలో నేత్రావతి నది మీద రైలు వేగంగా వెలుతోంది. ఆ సందర్బంలో రైలులో నుంచి నిలబడిన నయన తరువాత నైత్రావతి నదిలోకి దూకేసింది. విషయం గుర్తించిన సాటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
నదిలో గాలించడంలో నిపుణడు అయిన మోహమ్మద్, అతని టీమ్ సభ్యులు నేత్రావతి నదిలో కొన్ని గంటల పాటు గాలించి నయన శవాన్ని బయటకు తీశారు. నయన ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని రైల్వే పోలీసులు, దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు తెలిపారు. వేగంగా వెలుతున్న రైలులో నుంచి నయన నదిలోకి దూకడం చూసి షాక్ అయ్యామని సాటి ప్రయాణికులు చెప్పారని రైల్వే పోలీసులు తెలిపారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications