ప్రియుడి కోసం ఎంతపని చేసింది ?, కాబేయే భర్త గొంతు చీల్చి గిఫ్ట్ ఇచ్చిన కన్నింగ్ లేడి !

బెంగళూరు/హావేరి: ఓ అమ్మాయికి, యువకుడికి ముందు నుంచి పరిచయం ఉంది. రెండు సంవత్సరాల నుంచి అమ్మాయి, యవకుడు ప్రేమించుకుంటున్నారు. లవ్ మ్యాటర్ లీక్ అయ్యింది. అమ్మాయికి వెరే అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. కాబోయే భర్తను పార్క్ కు పిలిపించిన అమ్మాయి నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని కత్తి తీసుకుని అతని గొంతు కోసేసింది.

కర్ణాటకలోని హావేరి జిల్లాలోని రాణేబెన్నూరు పట్టణంలో ఓ అమ్మాయి నివాసం ఉంటున్నది. అమ్మాయి వయసు 17 ఏళ్లు మాత్రమే. అయితే ఆ అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. బాయ్ ఫ్రెండ్ తో ఆ అమ్మాయి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ప్రేమికులు ఇద్దరూ రాణేబెన్నూరు పట్టణానికి చెందిన వారు కావడంతో నిత్యం కలుస్తున్నారు.

అమ్మాయి లవ్ మ్యాటర్ ఆమె ఇంట్లో తెలిసిపోయింది. ఎలాగైనా అమ్మాయి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. పరప్పనహళ్లి తాలుకాలో దేవేంద్రగౌడ అనే యువకుడు ఓ కంపెనీ సేల్స్ మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియురాలికి, దేవేంద్రగౌడకు పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. మార్చి 3వ తేదీన ప్రియురాలు, దేవేంద్రగౌడల పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది.

 girlmurder

పెళ్లి జరిగిపోతే తన ప్రియుడు తనకు దూరం అవుతాడని, పెళ్లి చేసుకుంటున్న దేవేంద్రగౌడకు మ్యాటర్ తెలిసిపోతే తనకు లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయని అమ్మాయి భయపడింది. కాబోయే భర్తను చంపేస్తే తన ప్రియుడితో జీవితాంతం సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని కిలాడీ లేడీ అనుకుంది. అంతే ప్రియురాలు పక్కాప్లాన్ చేసింది.

నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని, ఊరి శివార్లలో ఉన్నఓం పబ్లిక్ స్కూల్ సమీపంలోని పార్క్ దగ్గరకు రావాలని ఆమె కాబోయే భర్త దేవేంద్రగౌడకు చెప్పింది. కాబోయే భార్య పెళ్లికి ముందే పిలవడంతో ఆమెతో మాట్లాడాలని ఆశతో దేవేంద్రగౌడ ఆశగా ఆమె చెప్పిన చోటకు వెళ్లాడు. తరువాత మనం పార్క్ లో ఇన్ స్టా రీల్స్ చేద్దామని, ముందుగా నువ్వు రెండు చేతులు కట్టేసుకోవాలని దేవేంద్రగౌడకు ఆమె చెప్పింది.

 lady

కాబోయే భార్య చెప్పిందని ఆమెతోనే దేవేంద్రగౌడ రెండు చేతులు వెనక్కి గట్టిగా కట్టించుకున్నాడు. తరువాత దగ్గరకు వెళ్లిన అమ్మాయి ఇప్పుడు నేను నీకు సరైన గిఫ్ట్ ఇస్తాను చూడూ అంటూ కత్తి తీసుకుని దేవేంద్రగౌడ గొంతు చీల్చి అక్కడి నుంచి పరారైయ్యింది. కాబోయే భార్య పెళ్లికి ముందే హత్య చెయ్యడానికి ప్రయత్నించడంతో దేవేంద్రగౌడ హడలిపోయాడు.

తీవ్రగాయాలైన దేవేంద్రగౌడ హావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. దేవేంద్రగౌడ మీద కత్తితో దాడి చేసిన అమ్మాయిని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని రాణేబెణ్ణూరు పోలీసులు తెలిపారు. కాబోయే భర్తను ఓ మైనర్ అమ్మాయి హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+