హోటల్ ల్లోకి ఒంటరిగా వెళ్లిన అమ్మాయి, ముగ్గురు యువకులు ఏం చేశారంటే ?, సీసీటీవీల్లో!
సిలికాన్ సిటీ బెంగళూరులో అమ్మాయిలను ఎక్కడంటే అక్కడ ముట్టుకుని వికృత ఆనందం అనుభవిస్తున్న ఓ వ్యక్తి చేసిన నీచమైన పని సీసీటీవీలో రికార్డవ్వగా ఆ క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. హోటల్ దగ్గర నిలబడి కాఫీ తాగుతున్న ఓ యువతిని కామంతో తాకుతూ ఆమెను లైగింక వేధింపులకు పాల్పడిన ఘటన బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరులో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కామాంధుల దెబ్బకు అమ్మాయిలు, మహిళలు భయంతో పరుగులు తీస్తున్నారు. బెంగుళూరులో దోపిడీలు, దొంగతనం కేసులు, మహిళలపై లైంగిక వేధింపుల కేసులు పదేపదే నమోదు అవుతున్నాయని వెలుగు చూస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది.

సిలికాన్ సిటీలో అమ్మాయిలను ముట్టుకుని వికృత ఆనందాన్ని అనుభవిస్తున్న ఓ కామాంధుడి నీచమైన చర్య సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. హోటల్ దగ్గర ఒంటరిగా నిలబడి కాఫీ తాగుతూ ఫ్రెండ్స్ కోసం వేచి చూస్తున్న యువతిని లైగింక వేధింపులకు గురిచెయ్యడం కలకలం రేపింది. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన సీసీటీవీలల్లో రికార్డు అయ్యింది. బెంగళూరులోని విజయనగరలోని నమ్మూట హోటల్ లో ఈ ఘటన జరిగింది.
ముగ్గురు యువకులు కావాలనే యువతిని ఎక్కడంటే అక్కడ తాకాలని ప్లాన్ చేశారని, ముగ్గురూ ముందుగా మాట్లాడుకుంటున్నట్లు సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని సమాచారం. ఆ తర్వాత ఓ యువకుడు అక్కడే నిలబడిన యువతి వద్దకు వెళ్లి వెనుక నుంచి ఆమెను తాకాడు. మరో ఇద్దరు యువకులు ఆ సీన్ చూస్తున్నారు. దిక్కుతోచని స్పర్శతో కోపోద్రిక్తురాలైన యువతి వెంటనే అక్కడే ఆ యువతిని ప్రశ్నించింది. తరువాత కూడా యువతి కామాంధులైన యువకులతో గొడవ పడింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది.

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం జనవరి 10వ తేదీన ముగ్గురు యువకులు హోటల్ కు వెళ్లి దోసె ఆర్డర్ చేశారు. దోసె తింటూ హోటల్‌కి వచ్చిన అమ్మాయిలను చూస్తు అసభ్యంగా ప్రవర్తించారని తెలిసింది. అదే సమయంలో కాఫీ తాగుతూ నిలబడి ఉన్న యువతితో ఓ నిందితుడు అసభ్యంగా ప్రవర్తించగా మిగిలిన ఇద్దరు యువకులు చప్పట్లు కొట్టి కామాంధుడిని ఉత్సాహపరిచారని వెలుగు చూసింది.
యువకుడి అసభ్య ప్రవర్తనకు యువతి కేకలు వేసింది. అయితే ఈ ఘటనపై యువతి హోటల్ యాజమాన్యానికి, పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది. అయితే ఈ యువతికి లైంగిక వేధింపులు జరిగినట్లు మరో అమ్మాయికి జరగకుండా చూడాలని అనుకున్న హోటల్ క్యాషియర్ సుకన్యా విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజయనగర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications