Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

134 కోట్ల మందికి గుడ్ న్యూస్!

ఆధార్ డేటా భద్రతపై జరుగుతున్న ప్రచారానికి కేంద్ర సర్కారు తెరదించింది. ఆధార్ డేటాబేస్ నుంచి ఇంతవరకు ఎలాంటి డేటా లీక్ కాలేదని బుధవారం లోక్‌సభలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడెంటిటీ సిస్టమ్ అయిన ఆధార్ భద్రతపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 17న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక వివరణ ఇచ్చారు.

ఆధార్ డేటా భద్రత
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 134 కోట్ల మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ఆధార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 16,000 కోట్ల కంటే ఎక్కువ అథెంటికేషన్ లావాదేవీలు విజయవంతంగా జరిగాయి. యూఐడీఏఐ (UIDAI) డేటాబేస్ నుండి పౌరుల వ్యక్తిగత వివరాలు ఏనాడూ బయటకు వెళ్లలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Aadhaar Data Is Safe Government Assures 134 Crore Citizens in Parliament

ఆధార్ వ్యవస్థ కేవలం ఒకే రక్షణ కవచంతో పనిచేయదని, దీనికి 'డిఫెన్స్-ఇన్-డెప్త్' విధానం ఉందని మంత్రి వివరించారు.వ్యవస్థలో ఒక పొర విఫలమైనా, ఇతర భద్రతా పొరలు డేటాను కాపాడతాయి. ఆధార్ డేటా స్టోరేజీలో, ట్రాన్స్‌మిషన్‌లో ఉన్నప్పుడు అధునాతన ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా భద్రపరచబడుతుంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NCIIPC) ద్వారా ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షించబడుతుంది. అలాగే స్వతంత్ర ఏజెన్సీలతో సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తారు.

ఆధార్ 2026: రాబోయే కొత్త మార్పులు
ఆధార్ భద్రతను మరింత పెంచడానికి ప్రభుత్వం 2025-26లో మరికొన్ని కొత్త మార్పులు తీసుకురాబోతోంది, కేవలం వేలిముద్రలు కాకుండా 'ఫేస్ అథెంటికేషన్' ద్వారా ధ్రువీకరణను మరింత సులభతరం చేయనున్నారు. భౌతిక కార్డులపై పూర్తి చిరునామా లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా సరికొత్త డిజైన్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. హోటళ్లు, ఆఫీసుల వద్ద ఆధార్ కార్డు కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 'ఆఫ్‌లైన్ ఐడీ చెక్' సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఆధార్ డేటా భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో దీనిని కాపాడుతోందని కేంద్రం భరోసా ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+