ఆధార్ ఫ్రీ అప్‌డేట్.... మరోసారి గడువు పొడిగింపు..
ఆధార్ ఫ్రీ అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారికి ఓ శుభవార్త. ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్నిచ్చింది. నిజానికి, ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు డిసెంబర్ 14, 2023తో ముగియనుంది. అయితే, ఈ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్‌కార్డులోని మార్పులను ఉచితంగా చేసుకోవాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశమనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మరో మూడు నెలల గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అంటే మార్చి 14, 2024 వరకూ ఉచితంగా ఆధార్‌కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చన్నమాట. మరెందుకాలస్యం వినియోగదారులను ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి. దీని నుంచి ప్రజల్లో మంచి స్పందన రావడంతో ఈ గడవును మరోసారి పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించిది. గడువు ముగిసాక ఎవరైనా ఆధార్‌లో మార్పలు చేసుకోవాలనుకంటే మాత్రం రుసువు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూడు నెలల సమయంలో ఎవరైనా మార్పులు చేసుకోవచ్చు.

ఆధార్ కార్డులో మార్పులు చేసుకోండిలా : ఆధార్‌లో మార్పులు చేసుకోవాలనుకునేవారు ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఇక్కడ ఇచ్చిన వెబ్‌సైట్‌లో మీ ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు 'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అడ్రస్‌ను నిరూపించేలా మరో పత్రాన్నిఅప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఒకవేళ ఈ వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే, వీటిలో సవరణ చేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి 'ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్' డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత 14 అంకెల 'అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్' వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications