రూ.12 కోట్ల ఆస్తి, చేతిలో 6.5 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు.. ఒక్క క్రిమినల్ కేసు లేదట..

మహారాష్ట్ర ఎన్నికల బరిలో వర్లీ నుంచి పోటీచేస్తోన్న శివసేన నేత ఆదిత్య థాకరే తన ఆస్తుల చిట్టాను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద రూ.12 కోట్ల ఆస్తి పాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే సొంతంగా బీఎండబ్ల్యూ కారు కూడా ఉందని చెప్పారు. అయితే తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని చెప్పడం విశేషం.

వర్లీ నుంచి ఆదిత్య థాకరే పోటీచేస్తున్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో 11.38 కోట్లు బాండ్లు కాగా, 77.66 లక్షలు స్థిరాస్తులు అని పేర్కొన్నారు. తన వద్ద రూ.6.5 లక్షల నగదు ఉందన్నారు. అలాగే తనకు సొంతంగా బీఎండబ్ల్యూ కారు ఉందన్నారు. తనపై ఒక్క క్రిమినల్ కేసు లేదని పేర్కొన్నారు.

Aaditya Thackeray worth Rs 12 crore, owns BMW car

శివసేన అధినేత బాల్ థాకరే మనమడు ఆదిత్య థాకరే. థాకరే వారసుల్లో ఎవరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. బాల్ థాకరే ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు ఉద్దవ్ థాకరే కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అతని కుమారుడు ఆదిత్య థాకరే మాత్రం ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.

నిన్నటి నుంచి వర్లీలో ప్రచార పర్వం ప్రారంభించారు. ఇందులో భాగంగా 'హౌ ఆర్ యూ' వర్లీ అంటూ పోస్టర్లతో క్యాంపెయిన్ చేశారు. స్థానిక మరాఠీతోపాటు తెలుగు, ఉర్దూ, గుజరాతీ బాషలో కూడా పోస్టర్లు వెలిశాయి. వర్లీలో మహారాష్ట్రతోపాటు తెలుగు, గుజరాతీ ప్రజలు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు పోస్టర్లను ఆదిత్య థాకరే ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+