అదేం అలవాటో!: అమీర్‌ఖాన్‌పై అనుపమ్‌ఖేర్ ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పైన అనుపమ్ ఖేర్ మరోసారి మండిపడ్డారు. ప్రతి అంశం పైన తన తాను అభిప్రాయం వ్యక్తం చేయవచ్చునని ఆయన భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. దిల్, దిల్ హై కీ మాన్తా నహీ సినిమా సమయంలో అమీర్ ఖాన్‌కి, ఇప్పటి అమీర్ ఖాన్‌కి చాలా తేడా ఉందన్నారు.
కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిన అమీర్ ఖాన్ తాను ఏది మాట్లాడినా ఫరవాలేదని భావించి, వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడన్నారు. గతంలో తాను చిత్రీకరించిన ఓ పాత్రను మహేశ్ భట్ వద్ద అమీర్ ఖాన్ చులకనగా మాట్లాడాడని ఆరోపించారు.

కొంతమంది తాము చెప్పేది మాత్రమే సరిగా ఉంటుందని, మిగతా ప్రపంచం అంతా తప్పు అనే భావనలో ఉంటారని ఎద్దేవా చేశారు. తనకు ఎవరితోను వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పరిశ్రమలో అందరూ తనకు మిత్రులేనని చెప్పారు.
అది అసహనం కావొచ్చు, మరొకటి కావొచ్చు దేని పైన అయినా తాను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చునని అమీర్ ఖాన్ భావిస్తున్నారన్నారు. అమీర్ ఖాన్ పట్ల తనకు గౌరవం ఉందని చెప్పారు. అయితే, అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి బాధ్యత ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications