మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్: ఎంపీతో పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దాను పెళ్లి చేసుకోనున్నారు. రాఘవ్ ఛద్దా-పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం కూడా ఖాయమైంది. ఈ నెల 13వ తేదీన వారి నిశ్చితార్థం జరుగనుంది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ముంబైలో నిశ్చితార్థ కార్యక్రమం జరుగునున్నట్లు తెలుస్తోంది.
రాఘవ్ ఛద్దా- రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తోన్న విషయం తెలిసిందే. ఢిల్లీ, పంజాబ్‌లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీకీ రాఘవ్ ఛద్దా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడే పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు.

బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు ఉంది పరిణీతి చోప్రాకు. ప్రియాంక చోప్రా చెల్లెలు ఆమె. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోగ్రఫీ సైనా మూవీలో లీడ్ క్యారెక్టర్‌లో నటించారు. మేరీ ప్యారీ బిందు, గోల్‌మాల్ ఎగైన్, నమస్తే ఇంగ్లాండ్, కేసరి, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, కోడ్ నేమ్ తిరంగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ఊంచాయ్. ప్రస్తుతం చమ్కీలా, క్యాప్సుల్ గిల్ సినిమాల్లో నటిస్తోన్నారు పరిణీతి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ ఛద్దా- పరిణీతి చోప్రాలది లవ్ మ్యారేజ్. కొంతకాలంగా వారు ప్రేమలో ఉన్నారు. గతంలో జంటగా కలిసి తిరుగుతూ మీడియా కంట కూడా పడ్డారు. పెళ్లి గురించి ఆరా తీసిన విలేకరులకు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారే తప్ప తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటపెట్టలేదు. ఇక తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటోన్నట్లు వెల్లడించారు. అక్టోబర్ చివరివారంలో వారు పెళ్లి పీటలు ఎక్కుతారనే అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications