ABP - CVoter survey:గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ ఘటనతో యోగీ పాపులారిటీ తగ్గిందా..?
లక్నో:గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా అవతారమెత్తిన అతీక్ అహ్మద్ అతని సోదరుడు ఆష్రఫ్ కొద్ది రోజుల క్రితం ప్రయాగరాజ్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం కాల్విన్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా ముగ్గురు షూటర్లు వారిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపి చంపేశారు.ఇదంతా కెమెరా ముందే జరిగింది. ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
ఎస్పీ కాంగ్రెస్, బీఎస్పీతో సహా అన్ని విపక్ష పార్టీలు యోగీ సర్కార్ పై విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో శాంతిభద్రతలు యూపీలో క్షీణించాయంటూ విమర్శలు చేశాయి. మరోవైపు గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ అతని సోదరుడి మృతిపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఘటన తర్వాత యోగీ సర్కార్ గ్రాఫ్ పెరిగిందా లేదా అనే అంశంపై ఏబీపీ సీఓటర్ సంస్థలు సర్వే నిర్వహించాయి.

అతీక్ అహ్మద్ సోదరుల హత్య ఘటన తర్వాత సీఎం యోగీ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్న ప్రశ్నకు చాలామంది పెరిగిందనే సమాధానం ఇచ్చారు. యోగీ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో 44శాతం మంది యోగీకి మద్దతుగా నిలిచారు. 30శాతం మంది ఘటనతో యోగీ పాపులారిటీ పడిపోయిందని సమాధానం ఇచ్చారు. 15శాతం మంది ఎలాంటి మార్పులేదని చెప్పగా మరో 11శాతం మంది తెలియదని సమాధానం ఇచ్చారు.
అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితురాలిగా మారారు.హత్య జరిగినప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది.ఇతడితో పాటు బాంబర్ గుడ్డు ముస్లిం కూడా జాడ లేదు.యూపీ పోలీసులతో పాటు యూపీ ఎస్టీఎఫ్ బృందాలు వీరిద్దరి కోసం గాలిస్తున్నాయి.ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక జిల్లాల్లో డ్రోన్‌ల ద్వారా కూడా నిఘా పెడుతున్నారు.అయితే వీరిద్దరి ఆచూకీకి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications