రేప్ వ్యాఖ్యలు: అజ్మీపై కోడలు, నటి అయేషా ఫైర్

తన మామ చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే ఆ ప్రకటనతో తనతో పాటు పర్షాన్ కూడా తీవ్రంగా సిగ్గుపడుతున్నామని, అది తమకు ఇబ్బంది కరంగా ఉందని అయేషా టకియా అన్నారు. ట్విట్టర్‌లో ఆమె ఆ విధంగా ప్రతిస్పందించారు.
అయితే, అబూ అజ్మీ కుమారుడు, అయేషా టకియా భర్త పర్షాన్ అజ్మీ తన తండ్రి వ్యాఖ్యలను సమర్థించారు. అయితే, అత్యాచారానికి పాల్పడినవారిని కూడా ఉరి తీయాలని ఆయన అన్నారు.
వివాహం జరగకముందు సెక్స్ అనుభవించే అమ్మాయిలను ఉరి తీయాలని ఆయన అన్నారు. దాంతో ఆగకుండా ఆత్యాచార బాధితులను కూడా ఉరి తీయాలని ఆయన వ్యాఖ్యానించారు. అత్యాచారంపై ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications