కరుణానిధి అంత్యక్రియలు జరిగే ప్రాంతం ఇదే: ఎంజీఆర్-జయ, అన్నా-కరుణ
Recommended Video

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరగనున్నాయి. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అడ్డంకి తొలగిపోయింది. స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అన్నాదురై సమాధి సమీపంలోనే కరుణ ఖనానికి ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, సాయంత్రం నాలుగు గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆరు గంటలకు అన్నాదురై స్మారకం పక్కనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాజీ హాలు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మెరీనా బీచ్ ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది.

అంతిమయాత్ర సుమారు రెండు గంటల వరకు ఉంటుంది. ఎంజీఆర్ సమాధికి వెనుక వైపు జయలలిత అంత్యక్రియలు జరిగాయి. అన్నాదురై సమాధి వెనుక ప్రాంతంలో కరుణానిధి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు చోటు కల్పించకపోవడం తనను బాధించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాను తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేశానని, కానీ అతను అందుబాటులోకి రాలేదని, ఇదే విషయమై ప్రధాని మోడీకి ఫోన్ చేశానని చెప్పారు. కరుణానిధి మృతి దేశానికి తీరని లోటు అన్నారు.
కరుణ మరణ వార్త తెలిసి కార్యకర్తల గుండె ఆగింది
కరుణానిధి మరణవార్త తెలిసి ఇద్దరు కార్యకర్తల గుండె ఆగింది. మైలాడుతురైకి చెందిన సుబ్రహ్మణ్యం, నాగపట్టణానికి చెందిన రాజేంద్రన్ పార్టీ కార్యకర్తలు. కరుణానిధికి వీరాభిమానులు. 50 ఏళ్ల పైబడిన ఈ ఇద్దరూ కరుణానిధి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు.
మంగళవారం సాయంత్రం కరుణ మరణవార్త తెలిసిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. వీరు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నిండింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications