చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వాతి పిలిస్తేనే చెన్నైకి వచ్చా: వైరల్‌గా రామ్‌కుమార్-స్వాతిల ఫొటో?

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిందితుడు రామ్‌కుమార్.. స్వాతి రమ్మంటేనే తాను చెన్నైకి వచ్చానని చెబుతున్నాడు. కాగా, రామ్‌కుమార్ సమ్మతి లేకుండానే బెయిల్ పిటిషన్ వేసిన న్యాయవాది కృష్ణమూర్తి ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దీంతో మరో లాయర్ రామరాజ్ నిందితుడి తరుఫున వాదించేందుకు సిద్ధమయ్యారు.

స్వాతిని ఎఫ్‌బీలో చూసి ప్రేమించా! 'కొండముచ్చు' అనడంతోనే ఉన్మాదినయ్యా: రాంకుమార్స్వాతిని ఎఫ్‌బీలో చూసి ప్రేమించా! 'కొండముచ్చు' అనడంతోనే ఉన్మాదినయ్యా: రాంకుమార్

బుధవారం జైలులో అతడ్ని కలిసి ఆయన కొత్తగా ఈ వాదనలు తెరపైకి తెచ్చారు. స్వాతినే రామ్‌ కుమార్‌ను చెన్నైకి పిలిపించినట్లు న్యాయవాది రామరాజ్ చెబుతున్నారు. స్వాతి రామ్‌కుమార్‌ మధ్యఎలాంటి కమ్యూనికేషన్ లేదంటున్న పోలీసుల వాదనను ఆయన ఖండించారు. సీసీటీవీలో బైక్ వెళ్తున్న వ్యక్తి రామ్ కుమార్ కాదని, అతనికి అసలు బైక్ నడపడమే రాదంటున్నారు.

Accused Ramkumar claims Swathi called him to Chennai

రామ్ కుమార్ గొంతు గాయంపైనా న్యాయవాది రామరాజ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ గాయం లేదన్నారు. రామ్ కుమార్ అరెస్ట్ తర్వాత నుంచి అతడి తల్లిదండ్రులను వారి ఇంట్లోకి పోలీసులు అనుమతించడంలేదని ఆయన ఆరోపించారు.

రామ్‌కుమార్ తండ్రి అనుమతితో బెయిల్ కోసం సోమవారం దరఖాస్తు చేస్తానని న్యాయవాది రామరాజ్ తెలిపారు. కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో రామరాజు జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. జులై 15న బెయిల్‌పై విచారణ జరగనుంది.

మార్ఫింగే: వాట్సాప్‌లో స్వాతి, రామ్‌కుమార్‌‌ల ఫోటో

చెన్నైనుంగంబాక్కం రైల్వేస్టేషనలో హత్యకు గురైన స్వాతి, హంతకుడు రామ్‌కుమార్‌ జోడీగా ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు వారు తీసుకున్నవి కాదని ఎవరో వీటిని మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశారని పరుశురామ్‌ అనే వ్యక్తి గురువారం మీడియాకు వెల్లడించారు.

టెక్కీ స్వాతి హత్య కేసులో ట్విస్ట్: పోలీసులపై లాయర్ నిందలుటెక్కీ స్వాతి హత్య కేసులో ట్విస్ట్: పోలీసులపై లాయర్ నిందలు

సోషల్‌ మీడియాలో కనిపించిన ఫోటోలో ఉన్నది స్వాతి- రామ్‌కుమార్‌ కాదని, తన కుమారుడు ప్రదీప్‌, అతని స్నేహితురాలితో కలిసి పుదుచ్చేరీలో తీయించుకున్న ఫోటో అని తెలిపారు. ఎవరో సంఘ విద్రోహులు మార్ఫింగ్‌ చేసి ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే కుమార్తెను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ఇలాంటి చర్యలు మరింత బాధిస్తాయని, ఇటువంటి చర్యలు విరమించుకోవాలని పరశురామ్ విజ్ఞప్తి చేశారు.

English summary
In a series of curious twists and turns, the advocate who represented the suspect in Swathi murder case withdrew himself, while another who met the suspect, P Ramkumar, in prison alleged that the young man had come to Chennai on her bidding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X