సినిమా స్టైల్లో విమానంలో వచ్చాడు, కడుపు స్కాన్ చేస్తే బిత్తరపోయిన అధికారులు, థ్రిల్లర్ స్కెచ్!

సినిమా కథను మంచిన స్టోరీ లైవ్ లో చూసిన అధికారులు బిత్తరపోయారు. ఈ నిందితుడి ప్లాన్ తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొకైన్‌ క్యాప్సూల్స్‌ను కడుపులో పెట్టుకుని అడ్డంగా చిక్కిపోయాడు. సుమారు 2 కిలోల కోకైన్ కడుపులో పెట్టుకున్నాడు. బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నైజీరియన్ పౌరుడు కొకైన్ ను కడుపులో దాచిపెట్టుకుని రావడంతో అతన్ని అరెస్టు చేశారు.

ఇథియోపియాలోని అడిస్‌ అబాబా నుంచి బెంగళూరుకు 99 క్యాప్సూల్స్‌లో రెండు కిలోల డ్రగ్‌ను తీసుకుని వచ్చిన నైజీరియా దేశస్థుడు అధికారులకు పట్టుబడ్డాడు. ఇది అతిపెద్ద కొకైన్ స్మగ్లింగ్ ప్రయత్నమని అధికారులు అంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు నిందితులడి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 20 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Accused who came from abroad with 2 kg of cocaine hidden in his stomach was arrested in Bengaluru

నిందితుడిని ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చేర్చించి కోకైన్ ను బయటకు తీసిన తర్వాత అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. అధికారుల కథనం ప్రకారం భారతదేశానికి వైద్య చికిత్స వీసాపై 40 ఏళ్ల నైజీరియన్ పాస్‌పోర్ట్ తీసుకుని వచ్చాడు. బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు నిందితుడి కదలికల మీద అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

స్మగ్లింగ్ ఆపరేషన్ గురించి తెలుసుకున్న అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు. అధికారుల విచారణలో నిందితుడు అడిస్ అబాబాలో విమానం ఎక్కే ముందు కొకైన్ క్యాప్సూల్ సేవించినట్లు వెలుగులోకి వచ్చింది. అతనిని అరెస్టు చేయడానికి కోర్టు ఆర్డర్ తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల తరువాత అతని శరీరం నుంచి అన్ని డ్రగ్ క్యాప్సూల్స్‌ను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

నిందితుడి కడుపులో మొత్తం 99 కొకైన్ క్యాప్సూల్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు. కొకైన్ రెండు కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుందని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువ రూ. 20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నైజీరియన్ జాతీయుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద నిందితుడిపై కేసులు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+