Akshay Kumar:బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం..!!
బాలీవుడ్ 'ఖిలాడీ'అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సోమవారం సాయంత్రం ముంబై విమానాశ్రయం నుంచి తమ జుహు నివాసానికి వెళ్తుండగా వీరి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది
అసలేం జరిగిందంటే..?
ఒక అతివేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు తొలుత ఒక ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో పక్కనే ఉన్న అక్షయ్ కుమార్ సెక్యూరిటీ వాహనంపైకి దూసుకెళ్లింది. దీని ప్రభావంతో సెక్యూరిటీ వాహనం అక్షయ్ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఇలా ఒకదాని వెనుక ఒకటి వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించింది.

మానవత్వం చాటుకున్న అక్షయ్ కుమార్
ప్రమాదం జరిగిన వెంటనే అక్షయ్ కుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారు దిగి బాధితులకు సాయం చేసేందుకు ఉరుకులు పెట్టారు.సెక్యూరిటీ కారు కింద నలిగిపోయిన ఆటోలో డ్రైవర్, ప్రయాణికుడు చిక్కుకుపోయారు.అక్షయ్ తన సిబ్బందితో కలిసి స్వయంగా ఆటోను పైకి లేపి, లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు.స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి అక్షయ్ సమయస్ఫూర్తిని, మానవత్వాన్ని ప్రశంసించారు.
#AkshayKumar's car gets hit as a Mercedes crashes into an auto rickshaw in Juhu, #Mumbai, around 9 pm. The auto rickshaw then collided with Akshay Kumar's Innova. The auto driver and passenger were injured and taken to the hospital, but no fatalities were reported. pic.twitter.com/rglfjOnoUi
— Siraj Noorani (@sirajnoorani) January 19, 2026
25వ వెడ్డింగ్ యానివర్సరీ వేళ..
అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తమ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి విదేశాలకు వెళ్లారు. అక్కడ వేడుకలు ముగించుకుని ముంబైలో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ప్రస్తుతం అక్షయ్ కుటుంబంతో పాటు ఆటోలో ఉన్నవారు కూడా సురక్షితంగా ఉన్నారని సమాచారం.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications