వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయిన్ పాయల్ రోహత్గీకి బెయిల్.. రెండు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత ఊరట

|
Google Oneindia TeluguNews

నటి పాయల్ రోహత్గీకి ఊరట లభించింది. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆమె గత రెండు రోజులుగా రాజస్థాన్ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, రాజస్థాన్ బుండీలోని స్థానిక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు

నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు

మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, ఇతర కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 21వ తేదీన పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై యూట్ కాంగ్రెస్ నేత చర్మేష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

అరెస్ట్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

అరెస్ట్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

తన అరెస్ట్ అనంతరం పాయల్ ట్విట్టర్‌లో స్పందించారు. మోతీలాల్ నెహ్రూపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ నుంచి సేకరించి నన్ను అరెస్ట్ చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఓ జోక్‌గా మారింది అని పాయల్ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు.

నమోదైన కేసులు ఇవే..

నమోదైన కేసులు ఇవే..

పాయల్‌పై ఐటీ యాక్ట్ సెక్షన్ 66, సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసుల కస్టడీకి తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ 16న తిరస్కరించడమే కాకుండా డిసెంబర్ 24వ వరకు జైలులోనే ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు బెయిల్ మంజూరు

కోర్టు బెయిల్ మంజూరు

అయితే మంగళవారం (డిసెంబర్ 17వ తేదీ) మరోసారి కోర్టులో బెయిల్ పిటిషన్‌ సమర్పించగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందిచారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను హీరోయిన్ పాయల్‌కు మంజూరు చేశారు. మంగళవారం సాయంత్రం వరకు ఆమె ఇంకా బెయిల్‌పై బయటకు రాలేదనిది తాజా సమాచారం.

English summary
Actor Payal Rohatgi gets bail in case of derogatory comments on Nehru Family. Actor granted bail by a local court in Bundi, Rajasthan, as of Tuesday, December 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X