Prakash Raj: ఇప్పుడు ఫిఫాను బ్యాన్ చేస్తారా..! దీపికకు మద్దతుగా ప్రకాశ్ రాజ్ సెటైరికల్ ట్వీట్..
ఫిఫా వరల్డ్ కప్ 2022 ముగిసింది. ఫైనల్ లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించి.. విజేతగా నిలిచింది. కాగా ఈ ఫిఫా వరల్డ్ కప్ ను బాలీవుడ్ నటి దీపిక పదుకొనె ఆవిష్కరించారు. ఇందుకు సబంధంచిన ఫొటోలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీ విషయంలో ఈ బిగోట్స్ ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ని బ్యాన్ చేస్తారా!" అని రాసుకొచ్చారు.\

బేషరమ్
దీపిక పదుకొనె షారుఖ్ ఖాన్ తో నటించిన పఠాన్ సినిమా బేషరమ్ అనే పాటలో దీపిక ధరించిన దుస్తులు విషయం ఈ మధ్య వివాదాస్పదం అయింది. సినిమాను బ్యాన్ చేయాలని కొన్ని చోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విషయంలోలో దీపికకు మద్దతుగా ప్రకాశ్ రాజ్ నిలిచారు. అందుకే ఆమె ఫీపా వరల్డ్ కప్ ను ఆవిష్కరించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు.

దే మొదటిసారి
ఫిఫా చరిత్రలో ఇలా ఓ నటికి ట్రోఫీని లాంచ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారట. దీపిక ట్రోఫీని లాంచ్ చేయడం భారతదేశానికి దక్కిన గర్వకారణం అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. దీపిక పదుకొనెకు కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య కూడా మద్దతుగా నిలిచారు. స్త్రీ ద్వేషంతోనే పలువురు దీపికా పదుకొణెను ట్రోల్ చేస్తున్నారని చెప్పారు.

ఎదురు తిరగాలి
స్త్రీ వ్యతిరేకతపై ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. 'బేషరమ్ రంగ్' పాట వివాదంపై స్పందించిన రమ్య.. సమంత, రష్మిక పేర్లను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రతి అంశంలో మహిళలే టార్గెట్ అవుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు రమ్య స్పష్టం చేశారు.
సాయి పల్లవి
ఆ మధ్య సాయి పల్లవి కూడా కాశ్మీర్ పండిట్ల నరమేధం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. గోసంరక్షణ పేరుతో ఇప్పుడు కూడా అలాంటి పనులే చేస్తున్నారు అని సాయి పల్లవి పేర్కొనడంతో పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications