కట్టప్ప కూతురు అరంగేట్రం: చీర రంగుతో క్లారిటీ

Actor Sathyaraj: కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేలో చేరారు. చెన్నైలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు.

ఆ సమయంలో ఆమె.. డీఎంకే పార్టీ జెండాలో ఉన్న నలుపు-ఎరుపు రంగులను ప్రతిబింబించేలా చీరను ధరించడం అందరినీ ఆకర్షించింది. సత్యరాజ్ మొదటి నుంచీ డీఎంకేకు అనుకూలంగా ఉంటూ వస్తోన్నారు. ఆ పార్టీ సానుభూతిపరుడిగా ఆయనకు గుర్తింపు తమిళ రాజకీయాల్లో. ద్రవిడ సిద్ధాంతాలను అనుసరిస్తుంటారనే విషయం తెలిసిందే.

Actor Sathyaraj s daughter Divya joins DMK in the presence of CM MK Stalin

అలాగే పెరియార్ సూక్తులు, విధానాలకూ మద్దతుదారుగా ఉంటోన్నారు. 2007లో పెరియార్ బయోపిక్‌లోనూ ఆయన పాత్రను పోషించారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ డీఎంకేలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు.

సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. కొడుకు పేరు శిబిరాజ్. శిబిరాజ్ తండ్రి బాటలో సాగుతున్నాడు. తమిళ సినిమాల్లో హీరోగా రాణిస్తోన్నాడు. దివ్య సత్యరాజ్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోన్నారు. ఆమె త్వరలో రాజకీయాల్లోకి వస్తారంటూ కొంతకాలంగా తమిళనాట వార్తలొచ్చాయి. ఇప్పుడు అవి వాస్తవ రూపాన్ని దాల్చాయి.

దివ్య సత్యరాజ్ వృత్తి రీత్యా పోషకాహార నిపుణురాలు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించే అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించే ఓ ఎన్జీవోనూ ప్రారంభించారు.

నిజానికి- గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దివ్య సత్యరాజ్‌కు బీజేపీ సీటు ఆఫర్ చేసిందంటూ వార్తలొచ్చాయి గానీ, ఆ పార్టీలో చేరడానికి, పోటీ చేయడానికి నిరాకరించారనే వాదనలూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె అప్పట్లో ధృవీకరించారు కూడా. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఓ పార్టీ తనను ఆహ్వానించిన మాట వాస్తవమేనని వెల్లడించారు.

రాజకీయాలంటే ఆసక్తి ఉన్నప్పటికీ- ఒక మతపరమైన పార్టీలో చేరడం తనకు ఇష్టం లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు దివ్య సత్యరాజ్. భవిష్యత్తులో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాననీ స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై లోక్‌సభ ఎన్నికల తరువాత స్పష్టత ఇస్తానంటూ అప్పట్లో చెప్పారు. దీనికి అనుగుణంగా ఆమె డీఎంకేలో జాయిన్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+