నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు: కేరళ ఎమ్మెల్యే మీద కేసు, సినిమాల్లో అర్దనగ్నంగా నటిస్తారు!

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు విషయంపై మహిళలను కించపరిచే విధంగా బహిరంగంగా మాట్లాడారని ఆరోపిస్తూ కేరళలోని పుంజార్ శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు (ఇండిపెండెంట్) పీసీ. జార్జ్ మీద ఆ రాష్ట్ర మహిళ కమిషన్ కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టింది.

నిత్యం వివాదాస్పాద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే జార్జ్ ఈ సారి ప్రముఖ నటి విషయంలో టీవీ చానల్స్ కు ఇంటర్వూ ఇస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పలు మహిళా సంఘాలు కేరళ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జార్జ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు.

 Actress assault: Case filed against MLA PC Geroge anti women remarks

నటిని కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చేశారని పోలీసులు అంటున్నారని, ఆ సంఘటన జరిగిన రెండు రోజులకే ఆమె ఎలా షూటింగ్ లో పాల్గొనిందని ఓ టీవీ చానల్ ఇంటర్వూలో జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా లైంగిక దాడి జరిగి ఉంటే ఆమె ఆసుపత్రిలో చేరాలి కదా అని ప్రశ్నించారు. ఈ కేసులో మలయాళం హీరో దిలీప్ ను అనవసరంగా అరెస్టు చేశారని అతన్ని వెనుకేసుకొచ్చారు.

కొందురు హీరోయిన్లు మలయాళం సినిమాల్లో అర్దనగ్నం నటించి అడ్డంగా డబ్బులు సంపాధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి అయిన జార్జ్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని పలు మహిళా సంఘాలు ఫిర్యాదు చెయ్యడంతో కేరళ మహిళా కమిషన్ ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+