Samantha: కర్మ బూమరాంగ్ అయితే.. ఇలాగే ఉంటది!
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటి సమంతను గతంలో చేసిన వ్యాఖ్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన ఖుషీ చిత్రం నుంచి ఆరాధ్య అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాటలో సన్నివేశాలు, లిరిక్స్, సంగీతం బాగుండటంతో సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. మంచి స్పందన వస్తోంది. అయితే, ఇందులో ఓ సన్నివేశం మాత్రం వివాదాస్పదంగా మారింది.
ఆ పాట వీడియో క్లిప్‌లో హీరో విజయ్ దేవరకొండ, సమత మధ్య ప్రేమ పూర్వక సన్నివేశాలున్నాయి. అయితే, ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ తన కాలుతో సమంత చేతిని తాకుతాడు. ఈ సన్నివేశమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఆ వీడియో క్లిప్, ఫొటో వైరల్ చేస్తూ కొందరు నెటిజన్లు సమంతపై విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు.

గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రంలోని పాటలో సన్నివేశాలను గుర్తు చేశారు. సముద్ర తీరంలో హీరో అడుగుల(పాద ముద్రల)పై చేతులు పెట్టుకుంటూ హీరోయిన్ పాకుతుంది. ఆ సన్నివేశంపై గతంలో సమంత తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తనను ఆ సన్నివేశం తిరోగమనానికి దారితీసేలా ఉందని.. తనను ఎంతో కలిచివేసింది అంటూ సమంత వ్యాఖ్యానించారు.
Okarni ane mundu mana ki ade situation vastadi amo anukunte life ...rafu anukunte ade kharma@Samanthaprabhu2
— 🕋 مدنی786🕋 (@GD512022) July 13, 2023
Mind it karma hits back https://t.co/VG7hBGGYNi pic.twitter.com/iEQAoTswP8
ఈ క్రమంలో గతంలో సమంత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్లతో సమంతపై విమర్శలు ఎక్కుపెట్టారు నెటిజన్లు. అప్పుడు అలా స్పందించాయి.. ఇప్పుడు కాలితో తన్నినట్లుగా ఉన్న మీ పాట సన్నివేశం గురించి ఏం చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు. నీతులు ఇతరులకు చెప్పేందుకేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Saw a song of a yet to be released Telugu film.Not only is it deeply regressive,but it's point is actually that it is deeply regressive https://t.co/MBM8yKflO8 pic.twitter.com/TP87RKuI8i
— Ashraf Ashu DHFM 🔔 (@Asraf_Tweets) July 12, 2023
కర్మ బూమరాంగ్ అయితే ఇట్లనే ఉంటంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఖుషీ సినిమాలో సీన్ చూసి తాము కూడా తీవ్రంగా కలత చెందామని.. అది తిరోగమనానికి దారితీసేలా ఉందని నెటిజన్లు సమంతకు చురకలంటిస్తున్నారు. అయితే, సమంత ఈ సీన్, నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించాల్సి ఉంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రస్తుతం ఆమె ఓ ఆరు నెలలు షూటింగ్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, సమంత ఖుషీ చిత్రం తర్వాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్‌తో కలిసి నటించనున్నారు.
Karma is boomerang https://t.co/ikAAdqKVxk pic.twitter.com/z878WVSszl
— Rishi (@Telugu_abbayii) July 12, 2023












Click it and Unblock the Notifications