Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss: కంటెస్టెంట్ సంకనాకించేశాడు, ప్రేమ పేరుతో మోసం, కేసు పెట్టిన ప్రముఖ నటి !

చెన్నై/ హైదరాబాద్: ప్రేమించానని రెండు సంవత్సరాలు తనతో తిరిగి ఎంజాయ్ చేసి నిశ్చితార్థం చేసుకున్న Big Boss కంటెస్టెంట్ తనను మోసం చేశాడని ప్రముఖ నటి కేసు పెట్టింది. శారీరకంగా, మానసికంగా తనతో కలిసి తిరిగిన తన ప్రియుడు పెళ్లి చేసుకోమంటే ఎదురుతిరిగాడని, నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరింపులకు దిగాడని ప్రముఖ నటి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ నటిని అన్ని రకాలుగా వాడుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులు మూడు సెక్షన్ ల కింద కేసు నమోదు చెయ్యడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడం ప్రస్తుతం కలకలం రేపింది.

 ప్రముఖ నటి

ప్రముఖ నటి

సనమ్ శెట్టి అనే యువతి తెలుగు, తమిళ, మళయాలం, హిందీ బాషల్లో 20 సినిమాలకు పైగా నటించింది. సనమ్ శెట్టి తెలుగు, తమిళ, మళయాలం, హిందీ చిత్రపరిశ్రమలో ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని తన ప్రియుడు మోసం చేశాడని సనమ్ శెట్టి పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

 శ్రీలంక టూ బిగ్ బాస్

శ్రీలంక టూ బిగ్ బాస్

శ్రీలంకకు చెందిన దర్శన్ అలియాస్ దర్శిన్ చెన్నైలో ఉంటున్నాడు. తమిళ బిగ్ బాస్ సీజన్ -3 షోలో దర్శన్ పోటీ చేశాడు. శ్రీలంక నుంచి భారత్ వచ్చిన దర్శన్ తమిళ బిగ్ బాస్ - 3తో మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయ్యాడు. ఇలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ మీద ఇప్పుడు అతని ప్రియురాలు కేసు పెట్టింది.

 మా ఇద్దరి మద్య అన్నీ జరిగాయి: నటి సనమ్ శెట్టి

మా ఇద్దరి మద్య అన్నీ జరిగాయి: నటి సనమ్ శెట్టి

గత రెండు సంవత్సరాల నుంచి తాను దర్శన్ ప్రేమించుకున్నామని ప్రముఖ నటి సనమ్ శెట్టి చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తనతో మానసికంగా, శారీరకంగా కలిసి ఉన్న దర్శన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడని, బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తరువాత పెళ్లి చేసుకోనని ఎదురుతిరుగుతున్నాడని ప్రముఖ నటి సనమ్ శెట్టి చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

సనమ్, దర్శన్ ల ఫోటోలు రచ్చరచ్చ

సనమ్, దర్శన్ ల ఫోటోలు రచ్చరచ్చ

పెళ్లి పేరుతో తనను అన్నిరకాలుగా వాడుకుని తన జీవితాన్ని సంకనాకించి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నీ దిక్కునచోట చెప్పుకో అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ ఎదురుతిరిగాడని సనమ్ శెట్టి పోలీసు కేసు పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన దర్శన్ తాను ఇంతకు ముందే నిశ్చితార్థం చేసుకున్నామని సనమ్ శెట్టి పోలీసులకు కొన్నిసాక్షాలు ఇచ్చింది. ప్రియుడు మోసం చేశాడని కలత చెందిన సనమ్ శెట్టి ఆమె ప్రియుడు దర్శన్ తో నిశ్చితార్థం చేసుకున్న సమయంలో తీసిన ఫోటోలను స్వయంగా ఆమె మీడియాకు విడుదల చెయ్యడం పెద్ద దూమరం రేపింది.

 మాజీ ప్రియుడితో సనమ్ ఎంజాయ్ చేసింది

మాజీ ప్రియుడితో సనమ్ ఎంజాయ్ చేసింది

ప్రముఖ నటి సనమ్ శెట్టి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ ఆరోపించాడు. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సనమ్ శెట్టి ఆమె మాజీ ప్రియుడితో కలిసి పార్టీలు, పబ్ లు అంటూ ఎక్కపడితే అక్కడ తిరిగి ఎంజాయ్ చేసిందని, ఆమె తనను మోసం చేసిందని బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ మీడియా ముందు ఆరోపించాడు. ప్రముఖ నటి సనమ్ శెట్టి, బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం గందరగోళానికి కారణం అయ్యింది.

 దర్శన్ దిమ్మతిరిగిపోయింది

దర్శన్ దిమ్మతిరిగిపోయింది

ప్రముఖ నటి సనమ్ శెట్టి ఫిర్యాదు మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ మీద చెన్నైలోని అడయూర్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో మూడు సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ మీద అమ్మాయిని మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం చేసుకుని ఎదురుతిరిగాడని తదితర ఆరోపణలపై కేసులు నమోదు కావడంతో అతన్ని కచ్చితంగా అరెస్టు చేస్తారు ? అంటూ తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శన్ వ్యవహారం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+