• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sanjana: ఇస్లాం మతంలోకి హీరోయిన్, మౌల్వీపై కేసు, ఏం జరిగిందంటే, మేడమ్ మాయం, లవ్ జీహాద్ ? !

|

బెంగళూరు/ న్యూఢిల్లీ: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన స్కాండిల్ వుడ్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నటి సంజనాను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, ఇది పక్కా లవ్ జీహాద్ ప్లాన్ అని ఆరోపిస్తూ మతం మార్చిన మౌల్వీ మీద ప్రముఖ న్యాయవాది కేసు పెట్టారు. బెయిల్ మీద బయటకు వచ్చిన సంజనా మాత్రం ఎవ్వరికి చిక్కకుండా మాయం కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. సంజనాను ఇస్లాం మతంలోకి మార్చిన మౌల్వీ మాత్రం ఆరోజు ఏం జరిగింది అనే విషయంలో వివరణ ఇచ్చారు.

Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!

 డ్రగ్స్ కేసులో జైలుపాలైన హీరోయిన్

డ్రగ్స్ కేసులో జైలుపాలైన హీరోయిన్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా గల్రానీని మూడు నెలల క్రితం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంజనా అనేక ప్రయత్నాలు చేసి చివరికి అనారోగ్యం కారణంతో మూడు రోజుల క్రితం కర్ణాటక హైకోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చారు.

 మతం మార్చుకున్న సంజనా

మతం మార్చుకున్న సంజనా

2018లో నటి సంజనా హిందూ మతం మారిపోయారని ఆర్ టీఐ కార్యకర్త, ప్రముఖ వ్యాపారి ప్రశాంత్ సంబర్గి పదేపదే ఆరోపించారు. 2018లోనే నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి ఆమె పేరును మహిరా గా మార్చుకున్నారని ఆమె అరెస్టు అయిన తరువాత ప్రశాంత్ సంబర్గి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా గల్రాని, ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే ఇస్లాం మతం ఆచారం ప్రకారం డాక్టర్ అజీజ్, నటి సంజనా నిశ్చితార్థం, పెళ్లి కూడా జరిగిపోయాయి అంటూ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

 బెంగళూరులో మౌల్వీపై కేసు నమోదు

బెంగళూరులో మౌల్వీపై కేసు నమోదు

2018 అక్టోబర్ 9వ తేదీన హిందువు అయిన సంజనా గల్రానీకి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఆమె పేరును మహిరాగా మార్చారని, ఇస్లాం దర్మం ప్రకారం ఆమెకు మహిరా అని నామకరణం చేసి దృవీకరణ పత్రాం ఇచ్చారని, సంజనాకు ఇస్లాం మతం మార్చిన మౌల్వీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ప్రముఖ న్యాయవాది అమృతేష్ బెంగళూరులోని కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

 మౌల్వీ ఏం చెప్పారంటే ?

మౌల్వీ ఏం చెప్పారంటే ?

బెంగళూరులోని ట్యానరి రోడ్డులోని మదరసాకు చెందిన దరుల్ ఉలమ్ షవాతిలుత్ మౌల్వీ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఇస్లాం మతంకు ఆకర్షితురాలైన హీరోయిన్ సంజనా తాను ఇస్లాం మతం స్వీకరిస్తానని మా దగ్గరికి వచ్చిందని మౌల్వీ అన్నారు. తాను ఇస్లాం మతం స్వీకరిస్తున్నానని హైకోర్టు నుంచి నటి సంజనా స్వయంగా అఫిడవిట్ తీసుకు వచ్చారని, ఆ అఫిడవిట్ ప్రకారం ఆమెను ఇస్లాం మతంలోకి ఆహ్వానించి మహిరాగా పేరు మార్చామని మౌల్వీ అన్నారు. మేము బలవంతంగా సంజనాకు మతం మార్చలేదని మౌల్వీ మీడియాకు చెప్పారు.

 అజీజ్ తో సంజనా లవ్

అజీజ్ తో సంజనా లవ్

బెంగళూరులకు చెందిన ప్రముఖ కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ అజీజ్ ను ప్రేమించిన హీరోయిన్ సంజనా పెళ్లి చేసుకున్నారని, మహిరాగా పేరు మార్చుకున్నారని ఇటీవల కొన్ని ఫోటోలు బయటకు రావడం తీవ్రచర్చకు దారితీసింది. మూడు నెలల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన నటి సంజనా విశ్రాంతి తీసుకోవడానికి ఓ రిసార్టుకు వెళ్లారని తెలిసింది. అయితే సంజనా మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి మీడియాకు చిక్కడం లేదు. సంజనాకు బలవంతంగా మతం మార్చి ఇస్లాం మతం ఇచ్చారని న్యాయవాది కేసు పెట్టారని, నటి సంజనాను, మౌల్వీని విచారణ చేసిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బెంగళూరులోని కాటన్ పేట్ పోలీసులు తెలిపారు.

English summary
Acterss Sanjana: Complaint lodged against Darul Ulam Shawalilullah alleging that Sandalwood actress Sanjana was forcibly converted to Islam from Hinduism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X