ముద్దు పర్సనల్: కిస్ ఆఫ్ లవ్‌కు నటి శోభన వ్యతిరేకం
బెంగళూరు: మోరల్ పోలీసింగ్‌కు నిరసనగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం చేపట్టడాన్ని సినీ నటి శోభన వ్యతిరేకించారు. ముద్దు పెట్టుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. వారెందుకు చేస్తున్నారో తనకు తెలియడం లేదని, అది పూర్తి వ్యక్తిగత విషయమూ వ్యక్తిగత అంశమని ఆమె అన్నారు.
ఇప్పటికిప్పుడు కొంత మంది సరేననవచ్చు గానీ హృదయగతంగా బహరంగంగా వారి కూతుళ్లు ముద్దులు పెట్టుకోవడం ఎవరికీ నచ్చదని ఆమె అన్నారు. కేరళలో కిస్ ఆఫ్ లవ్ వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. సమాధి నిర్మాణం పనుల నిమిత్తం శోభన బెంగళూర్ వచ్చారు. భరతనాట్యం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది.
కిస్ ఆఫ్ లవ్ విషయంలో వాస్తవం మాట్లాడడానికి చాలా మంది వెనకాడుతున్నారని, తమ ప్రకటనలను విచ్ఛిన్నం చేస్తారనే భయంతో మాట్లాడడం లేదని ఆమె అన్నారు. వారికేం కావాలో ఎవరూ వాస్తవం చెప్పడం లేదని, ఎవరో ఒకరు ఏదో మాట్లాడితే ఆ మాటలను తారుమారు చేస్తున్నారని, దాంతో వాస్తవం మాట్లాడడానికి చాలా మంది భయపడుతున్నారని శోభన అన్నారు.

మోరల్ పోలిసింగ్‌కు నిరసనగా కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో కిస్ ఆఫ్ లవ్ తర్వాత విద్యార్థులు హగ్ ఆఫ్ లవ్ కార్యక్రమం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పది మంది విద్యార్థులు కళాశాల నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. కొజీకోడ్‌లోని డౌన్‌టౌన్ హోటల్ వద్ద నిర్వహించిన కిస్ ఆఫ్ లవ్‌కు సంఘీభావంగా మహారాజ కళాశాల విద్యార్థులు హగ్ ఆఫ్ లవ్ నిర్వహించారు.
నవంబర్ 2వ తేదీన మెరైన్ డ్రైవ్ మైదానంలో కిస్ ఆఫ్ లవ్ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొద్ది మంది విద్యార్థులు కళాశాల వద్ద గుమిగూడి కళాశాల అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ వినకుండా కౌగిలింతల కార్యక్రమం నిర్వహించారు. మీడియా ప్రచారంతో కిస్ ఆఫ్ లవ్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. దాదాపు 30 మందిని పోలీసులు ముందుగానే అరెస్టు చేయడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు, సానుభూతిపరులు చేపట్టలేకపోయారు.












Click it and Unblock the Notifications