Actress: మామ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ నటి, ముఖం పచ్చడి, రజనీ, సూర్యతో !

చెన్నై: రజనీకాంత్, సూర్యాతో పాటు పలు సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించిన మహిళ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న మహిళ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఆనటి జీవిస్తోంది. తన భర్త తండ్రి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ నటి పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది. తాను నటి అని తన అత్తమామలు తనకు ఇంతవరకు కోడలు అనే మర్యాదా కాని, గౌరవం కాని ఇవ్వలేదని నటి ఆరోపించింది. దానికి తోడు నీవు నటివి, నీకు అనేక మందితో చనువు ఉంటుంది కదా, నాతోకూడా చనువుగా ఉండూ అంటూ తన మామ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని నటి పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది. నటి ముఖం మీద ఆమె మామ చెక్కతో దాడి చెయ్యడంతో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతోంది.

 రజనీకాంత్, సూర్యా సినిమాల్లో నటించింది

రజనీకాంత్, సూర్యా సినిమాల్లో నటించింది

చెన్నై సిటీలోని మంగాడు ప్రాంతం సమీపంలోని బాలకృష్ణన్ నగర్ లో సురేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ సహాయ నటి శివరంజన అలియాస్ శివరంజని 17 సంవత్సరాల క్రితం సురేష్ ను వివాహం చేసుకుంది. సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న శివరంజని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్యా తదితర టాప్ హీరోల సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న శివరంజని ఇప్పటికే సురేష్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.

 అత్తమామలతో నివాసం ఉంటున్న నటి

అత్తమామలతో నివాసం ఉంటున్న నటి

భర్త సురేష్ తల్లిదండ్రులు శరవణన్, శాంతి దంపతులతో పాటు నటి శివరంజని కలిసి జీవిస్తోంది. షూటింగ్ లు లేని సమయంలో ఆ శివరంజని ఆమె భర్త సురేష్ బయటకు వెళ్లిన తరువాత ఇంట్లోనే ఉంటున్నది. అయితే భర్త సురేష్ తల్లిదండ్రులతో నటి శివరంజని అంటిముట్టనట్లు ఉండేదని సమాచారం.

 మామ మీద టార్చర్ కేసు పెట్టిన సహాయనటి

మామ మీద టార్చర్ కేసు పెట్టిన సహాయనటి

తన భర్త సురేష్ తండ్రి శరవణన్ తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, తన మీద దాడి చేశాడని నటి శివరంజని పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది. తాను నటి అని తన అత్తమామలు శరవణన్, శాంతిలు తనకు ఇంతవరకు తాను కోడలు అనే మర్యాదా కాని, గౌరవం కాని ఇవ్వలేదని నటి శివరంజని ఆరోపించింది.

 మామ వేధింపులు ఎక్కువ అయ్యాయి

మామ వేధింపులు ఎక్కువ అయ్యాయి

నీవు నటివి, నీకు అనేక మందితో చనువు ఉంటుంది కదా, నాతోకూడా చనువుగా ఉండూ అంటూ తన మామ శరవణన్ తన మీద లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఒకసారి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో ఎదురుతిరిగిన తన మీద చెక్కతో దాడి చేశాడని నటి శివరంజని ఆరోపించి పోలీసు కేసు పెట్టింది. నటి శివరంజని ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

 కేసు పెట్టినా పట్టించుకోలేదు

కేసు పెట్టినా పట్టించుకోలేదు

గతంలో తన అత్తమామల మీద పోలీసు కేసు పెట్టానని, అయితే పోలీసు శాఖలో మా అత్త శాంతి సమీప బంధువు ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తుండటంతో వారిని విచారించకుండా వాయిదాలు వేశారని నటి శివరంజని ఆరోపించడం కలకలం రేపింది. సహాయనటి ఆమె అత్తమామల మీద కేసు పెట్టిందని, విచారణ చెయ్యడానికి వెలితే వారు పరారైనారని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. నటి శివరంజని మీద ఆమె మామ శరవన్ దాడి చెయ్యడంతో కోలీవుడ్ ఉలిక్కిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+