Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actress: ప్రముఖ నటి సోదరుడి భార్య, అన్న ఒకేసారి ఆత్మహత్య, ఇంట్లో అన్నీఅమ్మేయండి, డెత్ నోట్ !

చెన్నై/ విల్లుపురం: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో కొన్ని కోట్ల మంది ఆర్థిక పరిస్థితి తారుమారైయ్యింది. ఆర్థిక పరిస్థితుల దెబ్బతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కోవిడ్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక పరిస్థితులను ఎదిరించలేని చాలా మంది వ్యాపారులు, సినీనటీ నటులు, టీవీ ఆర్టిస్టులు, ఉద్యోగాలు పోయిన వాళ్లు, సామాన్య ప్రజలు ఇలా పలు రంగాలకు చెందిన చాలా మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. బహుబాష నటి సోదరడి భార్య, ఆమె కుటంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఇంతకాలం ఆ నటి, బంధువులు ఆర్థిక సహాయం చెయ్యడంతో ఆమె కుటుంబ సభ్యులు ఇంతకాలం కాలం నెట్టుకుంటూ వచ్చారు. అయితే పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యాయి. ఆర్థిక పరిస్థితులను ఎదిరించలేక, బతకడానిక వేరే మార్గం లేక ప్రముఖ నటి సమీప బంధువు, ఆమె సోదరుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మా ఆత్మహత్యలకు ఎవ్వరూ కారణం కాదని, మా ఇంట్లోని విలువైన వస్తులు విక్రయించి మేము ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో వాళ్లకు ఆ డబ్బు ఇవ్వాలని, మా శవాలకు పోస్టుమార్టం నిర్వహించకూడదని డెత్ నోట్ రాసి పెట్టిన అన్నా, చెల్లి ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు హడలిపోయారు.

 కరోనా దెబ్బతో జీవితాలు తారుమారు

కరోనా దెబ్బతో జీవితాలు తారుమారు

కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో కొన్ని కోట్ల మంది ఆర్థిక పరిస్థితి తారుమారైయ్యింది. ఆర్థిక పరిస్థితుల దెబ్బతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కోవిడ్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక పరిస్థితులను ఎదిరించలేని చాలా మంది వ్యాపారులు, సినీనటీ నటులు, టీవీ ఆర్టిస్టులు, ఉద్యోగాలు పోయిన వాళ్లు, సామాన్య ప్రజలు ఇలా పలు రంగాలకు చెందిన చాలా మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు.

 ప్రముఖ నటి ఊర్వశి

ప్రముఖ నటి ఊర్వశి

నటి ఊర్వశి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం బాషల సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, సత్యరాజ్ (కట్టప్ప) తదితర టాప్ హీరోలతో నటి ఊర్వశి హీరోయిన్ గా నటించారు. పలు బాషల్లో నటించిన ఉర్వశి హీరోయిన్ గానే కాకుండా తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె తన సత్తాచాటుకున్నారు, నటి ఊర్వశికి కలమ్ అనే సోదరుడు ఉన్నాడు.

 ఊర్వశి సోదరుడు కమల్ భార్య

ఊర్వశి సోదరుడు కమల్ భార్య

నటి ఊర్వశి సోదరుడు కమల్ ప్రమీల (52) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. నటి ఊర్వశి ఆమె సోదరుడు కమల్, ఆయన భార్య ప్రమీలను చాలా సంవత్సరాల పాటు ఆర్థికంగా ఆదుకుంది. రెండు సంవత్సరాల క్రితం కమల్, ప్రమీల దంపతుల మద్య గొడవలు రావడంతో వారు విడిపోయారు.

 ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందులు

కమల్ భార్య ప్రమీల తమిళనాడులోని విల్లుపురంలోని విలియమ్స్ లేఔట్ లో ఆమె సోదరుడు సుదీంద్రన్ (54)తో కలిసి నివాసం ఉంటోంది. గతంలో సుదీంద్రన్ ప్రముఖ నటి దగ్గర మేనేజర్ గా పని చేసి ప్రస్తతం ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా ప్రమీల, ఆమె సోదరుడు సుదీంద్రన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని తెలిసింది.

 ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు

ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు

ఆర్థిక పరిస్థితులను ఎదిరించలేక, బతకడానిక వేరే మార్గం లేక నటి ఊర్వశి ఆడపడుచు ప్రమీల, ఆమె సోదరుడు సుదీంద్రన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో సమీప బంధువులు, చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూడటం కలకలం రేపింది.

Recommended Video

    Actress Pragya Jaiswal In Kakinada | Mugdha 14t Store Store Launch | Oneindia Telugu
     ఇంట్లో వస్తువులు మొత్తం అమ్మేసి డబ్బులు ఇచ్చేయండి

    ఇంట్లో వస్తువులు మొత్తం అమ్మేసి డబ్బులు ఇచ్చేయండి

    మా ఆత్మహత్యలకు ఎవ్వరూ కారణం కాదని, ఆర్థిక సమస్యలు, ఆనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామని, మా ఇంట్లోని విలువైన వస్తులు విక్రయించి మేము ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో వాళ్లకు, ఇంటి యజమానికి ఆ డబ్బు ఇవ్వాలని, మా శవాలకు పోస్టుమార్టం నిర్వహించకూడదని ప్రమీల, సుదీంద్రన్ డెత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు. ప్రమీల, సుదీంద్రన్ ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు హడలిపోయారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+