Actress:మేడమ్ ను ఢీకొట్టడానికి టాప్ నటి ఎంట్రీ, బంతి చామంతి !, లెక్కలు ఓకే, మరి?

పశ్చిమ బెంగాల్/ కొల్ కత్తా/ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా తాము అనుకున్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలని సూపర్ స్కెచ్ లు వేస్తోంది. కమలం పార్టీ విజయం కోసం అనేక మంది ప్రత్యర్థి పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు గాలం వేసిన బీజేపీ నాయకులు సినీ గ్లామర్ తోడు కోసం నటీనటులను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఓ రాష్ట్రంలో ఫేమస్ నటి బీజేపీలో చేరడంతో మాకు ఇంకా బలం పుంజుకుందని, కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ లేక్కలు వేస్తున్నారు. లెక్కలు ఓకే.... మరి ఫలితాలు ఎలా ఉంటాయో మాత్రం వేచి చూడాలి.

దీదీ కోటలో బీజేపీ పాగా?

దీదీ కోటలో బీజేపీ పాగా?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈ సారి కచ్చితంగా ఓడించి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు.

టాప్ యాక్టర్ శ్రబంతి చటర్జీ

టాప్ యాక్టర్ శ్రబంతి చటర్జీ

ప్రముఖ బెంగాలి నటి శ్రబంతి చటర్జీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పశ్చిమ బెంగాల్ లో శ్రబంతి చటర్జీ అనే పేరు తెలియని నేటి తరం యువత ఉండరు అంటే అది అతిసయోక్తికాదు. అలాంటి మంచి గుర్తింపు ఉన్న సిటీనటి శ్రబంతి చటర్జీకి బీజేపీ నాయకులు గాలం వేసి ఆమెను ఆ పార్టీలోకి ఆహ్వానించారు.

మేడమ్ ఎంట్రీతో మరింత బలం!

మేడమ్ ఎంట్రీతో మరింత బలం!

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా, పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ అధ్యక్షుడు దిలీప్ హోష్ తదితరుల సమక్షంలో ప్రముఖ సినీనటి శ్రబంతి చటర్జీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజాసేవ చెయ్యడానికి ఆసక్తిగా ఎదురు చూసిన నటి శ్రబంతి చటర్జీ బీజేపీలో చేరడంతో మాకు పశ్చిమ బెంగాల్ లో మరింత బలం వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీదీతో శ్రంబతి ఢీ కొడుతుందా?

దీదీతో శ్రంబతి ఢీ కొడుతుందా?

పశ్చిమ బెంగాల్ డాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొట్టడానికి అనేక మంది ప్రముఖ మహిళా నాయకురాళ్లు, సినీతారలు బీజేపీలో చేరుతున్నారు. ఎలాగైనా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వచ్చేలా చూడాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీదీతో శ్రబంతి చటర్జీ ఢీకొడతారా అంటూ అప్పుడే చర్చ మొదలైయ్యింది.

శ్రబంతి దెబ్బకు బంతి చామంతి

శ్రబంతి దెబ్బకు బంతి చామంతి

పశ్చిమ బెంగాల్ శ్రబంతి ఎంట్రీతో ప్రతిపక్షాలకు బంతి చామంతి సామెత సరిపోతుందని, వాళ్లకు ఇకముందు రాజకీయ కష్టాలు మొదలౌతాయని బీజేపీ కార్యకర్తలు పైకి చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీ నాయకులు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వేచిచూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+