Actress: నటి ఆత్మహత్య, ఆంధ్రా నుంచి వెళ్లి హీరోయిన్, ప్రేమ విఫలం, ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే ?, లెటర్ !

చెన్నై/తిరుపతి: మొదట టీవీ సీరియల్స్ లో నటించిన యువతి నటిగా గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్ గా చాన్స్ దక్కించుకుంది. హీరోయిన్ గా నటించిన ఆ యువతి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మంచి నటి అవుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ యువతి అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ నటి డెత్ నోట్ రాసిపెట్టింది. నేను జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను అని ఆ నటి డెత్ నోట్ రాసింది. ప్రముఖ దర్శకుడితో పీకలలోతు వరకు ప్రేమలో మునగిపోయిన నటి ఆమె ప్రేమ విఫలం అయ్యిందని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం తమిళ సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆమె సొంత ఊరిలో కలకలం రేపింది.

 చిత్తూరు జిల్లా అమ్మాయి

చిత్తూరు జిల్లా అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో పవలెన్ జెస్సికా అలియాస్ దీపా (29) అనే యువతి నివాసం ఉండేది. సోషల్ మీడియా, ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్, యూట్యూబ్ చానల్స్ ద్వారా తన కొంటె నటనతో జెస్సికా లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన జెస్సికా సినిమాల్లో నటించాలని అనుకుంది.

చెన్నైలో నివాసం

చెన్నైలో నివాసం

నాలుగు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని సత్యవేడు నుంచి చెన్నై చేరుకున్న జెస్సికా కోయంబేడు సమీపంలోని విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నది. పవలెన్ జెస్సికా తమిళ సినిమా చాన్స్ ల కోసం ప్రయత్నించింది.

టీవీ సీరియల్స్ నుంచి హీరోయిన్ వరకు

టీవీ సీరియల్స్ నుంచి హీరోయిన్ వరకు

పవలెన్ జెస్సికా అలియాస్ దీపాకు మొదట తమిళ టీవీ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది. థేరి, తుప్పలవారియన్, రాడ్ సన్ తదితర సినిమాల్లో నటించడానికి అవకాశం వచచిింది. కొత్త హీరో మహేంద్రన్ హీరోగా దర్శకుడు మహివర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన వైధ అనే సినిమాలో హీరోయిన్ గా చాన్స్ దక్కించుకుంది.

 ఫామ్ లోకి వచ్చే టైమ్ లో నటి దీపా ఆత్మహత్య

ఫామ్ లోకి వచ్చే టైమ్ లో నటి దీపా ఆత్మహత్య


వైధ సినిమాలో హీరోయిన్ గా నటించిన జెస్సికా అలియాస్ దీపా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని తమిళ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జెస్సికా అలియాస్ దీపా మంచి నటి అవుతుందని ఆమె అభిమానులు, తమిళ సినీ రంగంలోకి కొందరు అనుకుంటున్న సమయంలో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది.

ఫ్రెండ్స్ కు డౌట్ రావడంతో

ఫ్రెండ్స్ కు డౌట్ రావడంతో


ఆదివారం నటి దీపాకు ఆమె స్నేహితులు చాలా మంది ఫోన్ చేశారు. అయితే ఎవ్వరి ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడం, రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో నటి స్నేహితులు దీపా నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఓనర్ కు ఫోన్ చేసి చెప్పారు. అపార్ట్ మెంట్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు తలుపులు పగలగొట్టి చూడటంతో నటి జెస్సికా అలియాస్ దీపా వేల్ తో కిటికి ఊచలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

డెత్ నోట్ లో ఏముంది ?

డెత్ నోట్ లో ఏముంది ?


తమిళ నటి జెస్సికా అలియాస్ దీపా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టింది. నేను జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను అని ఆ నటి డెత్ నోట్ రాసిందని పోలీసులు చెప్పారు. అయితే నటి దీపా ఆమె ప్రేమికుడి పేరు మాత్రం డెత్ నోట్ లో రాయలేదని కోయంబేడు పోలీసులు అంటున్నారు.

 ఆ సినిమా డైరెక్టర్ ఎవరు ?

ఆ సినిమా డైరెక్టర్ ఎవరు ?

ప్రముఖ దర్శకుడితో పీకలలోతు వరకు ప్రేమలో మునగిపోయిన నటి జెస్సికా అలియాస్ దీపా ఆమె ప్రేమ విఫలం అయ్యిందని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం తమిళ సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆమె సొంత ఊరిలో కలకలం రేపింది. అయితే నటి జెస్సికా అలియాస్ దీపా ఆత్మహత్య కేసును పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+