ఆదర్శ్ సొసైటీ కుంభకోణం: చవాన్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అది పెద్ద కుంభకోణాల్లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం. ఆ కుంభకోణం కేసు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసు చార్జిషీట్ నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం నాడు నిర్ద్వద్దంగా తోసిపుచ్చింది.
అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తహిలియానీ బుధవారం తీర్పు చెప్పారు. ఇందుకోసం నాలుగు వారాల గడువిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

నాలుగు వారాల వరకు అశోక్ చవాన్‌పై ఎలాంటి అభియోగాల నమోదు కానీ, విచారణ కానీ జరపరాదని ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత జనవరి నుంచి అశోక్ చవాన్ ఈ మినహాయింపును అనుభవిస్తున్నారు, మరో నాలుగు వారాల పాటు సదరు మినహాయింపును పొడిగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. మహారాష్ట్రలో 201లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ స్కాంలో అశోక్ చవాన్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతని స్ధానంలో పృద్వీరాజ్ చవాన్‌ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నియమించిన విషయం తెలిసిందే.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications