Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aditya L1: ద్వాదశ రూపాల్లో సూర్యుడి ఫొటోలు: అతి సమీపం నుంచి..!!

ISRO: సూర్యుడిపై సరికొత్త అధ్యయనాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తన పని మరింత ముమ్మరం చేసింది. ఇదివరకే భూ కక్ష్యను దాటుకున్న ఈ శాటిలైట్ ఆదిత్యుడి వైపు దూసుకెళ్తోంది. తన గమ్యస్థానానికి చేరువ అవుతోంది.

ప్రయోగించిన తేదీ నుంచి ఆదిత్య ఎల్1 శాటిలైట్ 125 రోజుల్లో నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాయింట్‌కు అతి సమీపంలో ఉందీ శాటిలైట్. ఇంకొద్ది రోజుల్లో తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సూర్యుడిపై అధ్యయనాలను మొదలు పెడుతుంది.

 Aditya-L1 captures full-disk images of the Sun

నిర్దేశిత గమ్యానికి చేరుకోవడానికి ముందే- తన పని ఆరంభించింది. ఈ శాటిలైట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించిన పేలోడ్స్ ఒక్కటొక్కటిగా యాక్టివేట్ అవుతున్నాయి. ఇస్రో పంపించిన ప్రధాన పేలోడ్ హై- ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ (HEL1OS). ఇది 10- 150 కేవీ వైడ్ రేంజ్ ఎక్స్-రే ఎనర్జీ బ్యాండ్‌లో పనిచేస్తుంది.

ఇప్పుడు తాజాగా మరో పేలోడ్ యాక్టివేట్ అయింది. ఆదిత్య ఎల్1లో పేలోడ్‌గా పంపించిన సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) సూర్యుడిని అతి సమీపం నుంచి కొన్ని ఫొటోలను తీసింది. అవన్నీ కూడా అల్ట్రావయోలెట్.. అంటే అతినీలలోహిత రూపంలో తీసినవే కావడం, అది కూడా సూర్యుడి వేవ్‌లెంగ్త్‌ను ఫుల్ డిస్క్‌గా చిత్రీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీనికోసం వేర్వేరు ఫిల్టర్లను ఉపయోగించింది సూట్ పేలోడ్. ఈ ఫొటోలను తీసినప్పుడు ఆదిత్య ఎల్1 శాటిలైట్- సూర్యుడికి ఉన్న మధ్య వేవ్ లెంగ్త్ 200 నుంచి 400 నానో మీటర్లు. ఈ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో వాటిని పోస్ట్ చేసింది. ఆదిత్యుడి క్రొమోస్ఫియర్, ఫొటోస్పియర్‌పై అధ్యయనం చేయడానికి ఇదొక అవకాశంగా భావిస్తోంది ఇస్రో.

 Aditya-L1 captures full-disk images of the Sun

ఈ ఫొటోల్లో సన్ స్పాట్, ప్లేగ్, క్వైట్ సన్ రీజియన్స్.. స్పష్టంగా కనిపిస్తోన్నాయి. వీటి ద్వారా సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు లేదా సోలార్ రేడియషన్.. భూ వాతావరణంపై ఏ రకంగా ప్రభావితం చేయగలుగుతాయనేది అధ్యయనం చేయవచ్చని ఇస్రో తెలిపింది.

ఈ ఏడాది నవంబర్ 20వ తేదీన సూట్ పేలోడ్‌ను ఇస్రో యాక్టివేట్ చేసింది. ఈ పేలోడ్ నుంచి ఫొటోలు గానీ, ఇతర డేటా గానీ ఇస్రోకు అందడం ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే సూర్యుడి వేవ్‌లెంగ్త్‌ ఫుల్ డిస్క్‌ను చిత్రీకరించడం పట్ల ఇస్రో సంతృప్తిని వ్యక్తం చేసింది.

ఇస్రోతో పాటు పుణేలోని ఇంటర్- యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, కోల్‌కతలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఉదయ్‌పూర్‌లోని సోలార్ అబ్జర్వేటరీ, అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్శిటీ.. ఈ సూట్ పేలోడ్‌ను అభివృద్ధి చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+