Aditya L1: 125వ రోజున అనూహ్య మలుపు
ISRO: సూర్యుడిపై అధ్యయనాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తన గమ్యస్థానానికి చేరింది. ప్రయోగించిన తేదీ నుంచి 125వ రోజున నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకుంది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్ 1 శాటిలైట్‌ను విజయవంతంగా లాగ్రాంజ్ పాయింట్‌లో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది.
చంద్రయాన్ 3 తరువాత ఇస్రో సాధించిన మరో తిరుగులేని విజయం ఇది. గత సంవత్సరం చంద్రయాన్ 3 చంద్రుడిపై అడుగుమోపిన విషయం తెలిసిందే. పేలోడ్స్‌గా పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చందమామ దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యాయి. పరిశోధనలకు అవసరమైన డేటాను గ్రౌండ్ స్టేషన్‌కు చేరవేశాయి. ప్రస్తుతం ఆ పేలోడ్స్ అన్నీ కూడా ప్రాజెక్టు శాశ్వత నిద్రావస్థలోకి వెళ్లాయి.

అదే సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్షే ప్రయోగ కేంద్రం నుంచి ఆదిత్య శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ- సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆదిత్య ఎల్1 శాటిలైట్.. సూర్యుడి హ్యాలో ఆర్బిట్‌లో ప్రవేశించింది. ఆ వెంటనే దాన్ని లాగ్రాంజ్ పాయింట్ 1లో ఇంజెక్ట్ చేసినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లాగ్రాంజ్ పాయింట్.
సూర్యుడిపై అధ్యయనం చేయడానికి మొత్తంగా ఏడు రకాల పేలోడ్స్‌ను పంపించారు శాస్త్రవేత్తలు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో-ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హై-ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.. ఈ నాలుగూ రిమోట్ సెన్సింగ్‌తో పని చేస్తాయి.
మిగిలిన మూడు ఇన్-సైటు పేలోడ్స్. ఇందులో ఆదిత్య సోలార్ విండ్ పర్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్స్డ్ ట్రై-యాక్సియల్ హై రిజాల్యూషన్ డిజిటల్ మేగ్నెటోమీటర్స్ ఉన్నాయి. తొలి నాలుగు పేలోడ్స్.. ఇదివరకే యాక్టివేట్ అయ్యాయి. సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) సూర్యుడిని అతి సమీపం నుంచి కొన్ని ఫొటోలను తీసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications