Aditya L1 నుంచి ఇస్రోకు అందిన మొట్టమొదటి డేటా: అంతుచిక్కని విధంగా
బెంగళూరు: సూర్యుడిపై సరికొత్త అధ్యయనాలను చేపట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 తన పని మొదలుపెట్టింది. ఇదివరకే భూ కక్ష్యను దాటుకున్న ఈ శాటిలైట్ ఆదిత్యుడి వైపు దూసుకెళ్తోంది. తన గమ్యస్థానానికి మరింత చేరువ అయింది.
ప్రయోగించిన తేదీ నుంచి ఆదిత్య ఎల్1 శాటిలైట్ 125 రోజుల్లో నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాయింట్‌కు అతి సమీపంలో ఉందీ శాటిలైట్. దాన్నిచేరుకోవడానికి ఇంకో నెల రోజుల సమయం పట్టొచ్చు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో సూర్యుడిపై అధ్యయనాలను మొదలుపెడుతుంది.

నిర్దేశిత గమ్యానికి చేరుకోవడానికి ముందే- తన పని ఆరంభించింది. ఈ శాటిలైట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించిన పేలోడ్స్ ఒక్కటొక్కటిగా యాక్టివేట్ అవుతున్నాయి. ఇస్రో పంపించిన ప్రధాన పేలోడ్ హై- ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ (HEL1OS). ఇది 10- 150 కేవీ వైడ్ రేంజ్ ఎక్స్-రే ఎనర్జీ బ్యాండ్‌లో పనిచేస్తుంది.
ఈ పేలోడ్- సూర్యుడి నుంచి వెలువడే మొట్టమొదటి సౌరశక్తి/ కాంతి కిరణాల తీవ్రతను సంగ్రహించింది. అక్టోబర్ 29న భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చోటు చేసుకున్న సోలార్ యాక్టివిటీస్‌ను రికార్డ్ చేసింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సౌరశక్తి తీవ్రత అంటే- సూర్యుడి నుంచి వెలువడే మంటలు/సౌర జ్వాల ఉవ్వెత్తున చెలరేగుతుంటాయని నిర్దారించింది.
కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు అవి ఎగిసిపడుతుంటాయని హై- ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ పసిగట్టింది. ఈ సౌర జ్వాల ఎగిసిపడటాన్ని ఈ స్పెక్టోమీటర్ రికార్డ్ చేసింది. దీన్ని గరిష్ఠ సమయంగా గుర్తించింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా సెకెనులో పదోవంతు భాగంలో ఈ సౌరజ్వాల హఠాత్తుగా ప్రజ్వరిల్లుతుంటుందని, దీన్ని లెక్కగట్టడం అసాధారణ చర్యగా ఇస్రో అంచనా వేసింది.
ఆదిత్య ఎల్1 నుంచి అందిన మొట్టమొదటి సంకేంతం, డేటా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సౌర జ్వాల నుంచి 10 నిమిషాల వ్యవధిలో కొన్ని వందల ఎర్గ్ (Erg) ల శక్తి విడుదల అవుతుంది. రేడియో, ఆప్టికల్, అల్ట్రా వైలెట్, ఎక్స్- రే, హార్డ్ ఎక్స్ రే, గామా కిరణాలను విడుదల చేస్తుంది. వాటిని పసిగట్టేలా ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్ పేలోడ్‌ను డెవలప్ చేసింది ఇస్రో.












Click it and Unblock the Notifications