అబూసలేం జీవిత చరిత్ర రాసేందుకు జైల్లో ఉండేందుకు అనుమతి అడిగిన ఐఎఎస్

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐఎఎస్ అధికారికి వింత కోరిక కలిగింది. నెలరోజులపాటు జైల్లో గడపాలని ఆయన కోరుకొంటున్నారు. అయితే ఏదైనా నేరం చేసి జైలుకు వెళ్ళాలని ఆయన భావించడంలేదు.అయితే మాఫియాడాన్ అబూసలేం

గుణ: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐఎఎస్ అధికారికి వింత కోరిక కలిగింది. నెలరోజులపాటు జైల్లో గడపాలని ఆయన కోరుకొంటున్నారు. అయితే ఏదైనా నేరం చేసి జైలుకు వెళ్ళాలని ఆయన భావించడంలేదు.అయితే మాఫియాడాన్ అబూసలేం జీవిత చరిత్ర రాసేందుకుగాను ఆయన జైలులో గడపాలని భావిస్తున్నాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న నియాజ్ ఖాన్ కొన్నాళ్ళ నుండి జైలుకు వెళ్ళాలని బావిస్తున్నాడు. అయితే జైలులో శిక్షను అనుభవిస్తున్న మాఫియాడాన్ అబూసలేం ను కలుసుకోవడానికి ఆయన జైలుకు వెళ్ళాలని కోరుకొంటున్నారు.

ADM Wants To Spend Time With Abu Salem In Jail

మాఫియాడాన్ అబూసలేం జీవితచరిత్రను రాయడానికి నెలరోజుల పాటు జైల్లో గడపాలని ఆయన కోరుకొంటున్నారు.అయితే ఈ మేరకు తనకు నెలరోజులపాటు జైల్లో గడిపేందుకు అనుమతినివ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ రాజేష్ జైన్ ను కోరాడు.

నియాజ్ ఖాన్ ప్రస్తుతం ఓ నవల రాస్తున్నాడు. ఇందుకోసం ఓ నెలరోజులపాటు అబూ సలేంతో పాటు జైల్లో ఉంటానని అడుగుతున్నారుఅబూ సలేం జీవితం మీద ఎక్కువగా దృష్టిపెట్టి తన ఐదో నవల రాస్తున్నానని అతడి క్యారెక్టర్ ను పరిశీలించేందుకు అతడి రోజువారీ జీవితం గురించి తెలుసుకోవడానికి నెలరోజులపాటు జైల్లో సలేంతో గడిపేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారని ఖాన్ చెప్పారు.

దీంతో ఏం చేయాలో తెలియక కలెక్టర్ రాజేష్ జైన్ ఆ లేఖను బోపాల్ లోని తన సీనియర్లకు పంపారు. లవ్ డిమాండ్స్ , బ్లడ్ అనే పేరుతో ఖాన్ తన ఐదో నవల రాస్తున్నారు. ఇది థ్రిల్లర్ గా ఉండనుంది. దీన్ని పూర్తి చేయడానికి అబూ సలేం జీవితాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని ఆయన భావిస్తుననారు.

1995లో జరిగిన ప్రదీప్ జైన్ అనే బిల్డర్ హత్య కేసులో అబూ సలేం జీవితఖైదును అనుభవిస్తున్నారు. అతడిపై దాదాపుగా 54 క్రిమినల్ కేసులున్నాయి. ఒకనాటి బాలీవుడ్ నటి మోనికాబేడీ అబూసలేం ప్రియురాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+