షాక్: ఢిల్లీ మెట్రో రైలులో షర్ట్ విప్పేసిన ఆఫ్రికన్ మహిళ, యువకులతో ఇలా...
దేశ రాజధాని ఢిల్లీ శివారున గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాల్లో ఆఫ్రికావాసులపై జరిగిన జాతి వివక్షదాడులు ఇటీవల వెలుగుచూశాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారున గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాల్లో ఆఫ్రికావాసులపై జరిగిన జాతి వివక్షదాడులు ఇటీవల వెలుగుచూశాయి. ఈ దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని మెట్రో రైలులో ఓ ఆఫ్రికన్ మహిళ షర్ట్ విప్పేసి తనతో గొడవపడినవారిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది.
ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు మెట్రో రైలులో వెళ్తుండగా తోటి ప్రయాణీకులు వారితో వాదనకు దిగారు. కాసేపటి తర్వాత ఒకామె మరో మహిళను సీటులో కూర్చోబెట్టింది. తర్వాత కూడ మహిళలకు యువకులకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. వీరిద్దరిని బయటకు తోసేయండంటూ కొందరు అరిచారు.

ఇంతలో ఓ మహిళ తన షర్ట్ విప్పేసి కొట్లాటకు రండి అంటూ యువకులను ఉద్దేశించి ఆగ్రహాం వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కొందరు జోక్యం చేసుకొని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications