అయ్యో పాపం..! జనం ఇచ్చిన షాక్‌కు తిండి మానేసిన లాలూ..
రాంచీ : జబ్ తక్ రహేగా సమోసేమే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్‌మే లాలూ... తన కనుసైగతో బీహార్ పాలిటిక్స్‌ను నడిపిన లాలూ ప్రసాద్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్య ఇది. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్‌లో లాలూ ఉంటాడని దానర్థం. అయితే దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుపాలు కావడంతో ఆర్జేడీకి పెద్ద కష్టమే వచ్చింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది.
సార్వత్రిక సమరంలో ఆర్జేడీ ఘోర వైఫల్యంపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓటమితో ఆయన కుంగిపోయారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి లాలూ సరిగా ఆహారం తీసుకోవడంలేదని రాంచీ రిమ్స్‌లో ఆయనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్లు చెప్పారు. మే 23 నుంచి ఆయన డైలీ రొటీన్ గాడి తప్పిందని అన్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి లాలూ మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోవడంలేదని డాక్టర్ ఉమేష్ ప్రసాద్ చెప్పారు. మందులు, ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉన్నందున తిండి విషయంలో అజాగ్రత్త వద్దని చెప్పామని అన్నారు.

బీహార్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - ఆర్జేడీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే రాష్ట్రంలో 40స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39స్థానాలు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆర్జేడీ పరిస్థితి మెరుగవుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చని పార్టీ నేతలు లాలూకు సర్ది చెబుతున్నారు. అయినా లాలూ మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications