Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీకి మరో షాక్: సిద్ధూ బాటలో మరో ఎంపీ సతీమణి

న్యూఢిల్లీ: బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. బీజేపీని వీడినట్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించి ఒక్క రోజు కూడా గడవక ముందే ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ సతీమణి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఝా ఆప్‌లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మోడీకి షాకిచ్చిన సిద్ధూకు భార్య ఝలక్, కేజ్రీవాల్ సెల్యూట్

ఈ నేపథ్యంలో తన భార్య బీజేపీని వీడి ఆప్‌లో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన భార్య తీసుకున్న నిర్ణయంపై మీడియా విపరీత అర్థాలు తీయవద్దని సూచించారు. పార్టీ మారడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఆయన తెలిపారు.

After Navjot Singh Sidhu

అయితే కీర్తి అజాద్ బీజేపీలో ఉండగా, ఆయన భార్య మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతుండటం విశేషం. గతంలో డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజే నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం, ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించడం చకా చకా జరిగిపోయిన సంగతి తెలిసిందే.

ఎక్కడ చెడింది?: జైట్లీ ఎఫెక్ట్.. సిద్ధూ రాజీనామా వెనుక!

మరోవైపు సిద్ధూ భార్య నవ‌జోత్ కౌర్ సిద్ధూ మాత్రం తాను బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. ''ఆయన పంజాబ్ అభివృద్ది కోసం కలలు కంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు'' అని పేర్కొన్నారు.

కేజ్రీవాల్ బంపర్ ఆఫర్: మోడీకి సిద్ధూ ఝలక్, రాజ్యసభకు రిజైన్

అమృత్‌సర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన సిద్ధూ 2014లో ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీ కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనను పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ఆయన రాజ్యసభకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, సిద్ధూ రాజీనామాపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. రాజీనామా చేసిన సిద్ధూకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+