52 సెక్స్ వీడియోలు హర్ధిక్ పటేల్‌వేనా?

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి అనేక రకాల ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి హర్ధిక్ పటేల్ మద్దతను ప్రకటించారు. అయితే హర్ధిక్ పటేల్ సెక్స్ వీడియోలు ఇటీవల ఓ మీడియా ఛానల్ లో ప్రసారమయ్యాయి. అయితే ఈ వీడియోలపై న్యాయపోరాటం చేస్తానని హర్ధిక్ పటేల్ ప్రకటించారు. మరో వైపు బిజెపి వ్యవహరిస్తున్న తీరును పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి తప్పు బట్టింది.

హార్దిక్ పటేల్‌ ను దెబ్బతీసేందుకు అధికార బీజేపీ నేతలు 'రెండు సెక్స్ వీడియో క్లిప్స్' అస్త్రం ప్రయోగించారు. అయితే కేవలం అవి మార్ఫింగ్ చేసిన వీడియోలేనని, తనపై అనవసరంగా బీజేపీ బుదర జల్లే యత్నం చేస్తోందని హార్దిక్ పటేల్ ఆ వీడియో వివాదాన్ని తిప్పికొట్టారు.

 After Sex CD, Hardik Patel Group Says 52 More On The Way, Thanks To BJP

సెక్స్ సీడీల వివాదంపై పటీదార్ గ్రూప్ కన్వినర్ దినేష్ బంభానియా స్పందించారు.. ఎన్నికల్లో నెగ్గేందుకు బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్నారు. . బీజేపీ వద్ద ఓవరాల్‌గా 52 సెక్స్ వీడియోలున్నాయని ప్రకటించారు.. అందులో హార్దిక్ వీడియోలు 22, ఇతర పటీదార్ నేతలపై 30 మార్ఫింగ్ అశ్లీల వీడియోలు బీజేపీ నేతలు తయారు చేయించారని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ సృష్టించిన వీడియోలు విడుదల చేస్తూ హార్దిక్ పటేల్ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయడమే అధికార పార్టీ లక్ష్యమన్నారు. పటీదార్లను ఎదుర్కోలేక బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని బంభానియా విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+