'ఆ సెక్స్ సీడీ ఫేక్ అయితే హార్దిక్ ఫిర్యాదు చేయలేదేం', 'శృంగారం మీ ప్రాథమిక హక్కు'

అహ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ హోటల్ గదిలో ఓ అమ్మాయితో ఏకాంతంగా కనిపిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని హార్దిక్ చెప్పారు. వీడియోపై దళిత నేత జిగ్నేష్ స్పందించారు.

 హార్దిక్ పటేల్‌కు అండగా జిగ్నేష్

హార్దిక్ పటేల్‌కు అండగా జిగ్నేష్

గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మెవానీ మాట్లాడుతూ హార్దిక్ పటేల్‌కు అండగా నిలబడ్డారు. ఈ వీడియో విషయంలో హార్దిక్ సిగ్గుపడాల్సిన విషయం లేదని చెప్పారు. సెక్స్ అనేది ప్రాథమిక హక్కు అని చెప్పారు.

 మీ స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు లేదు

మీ స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు లేదు

మీ (హార్దిక్) వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేందుకు ఎవరికీ హక్కు లేదన్నారు. మీరు బాధపడవద్దని, నేను మీతో ఉన్నానని జిగ్నేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 గుజరాత్‌లో ఎన్నికల వేడి

గుజరాత్‌లో ఎన్నికల వేడి

కాగా, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఈ సమయంలో పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సెక్స్ క్లిప్ ఒకటి లీక్ అయింది. బీజేపీ నేతలకు ఇది ఆయుధంగా మారింది. కాంగ్రెస్‌తో జతకట్టిన హార్దిక్‌ను విమర్శించేందుకు బీజేపీ దీనిని ఉపయోగించుకుంది.

 అబద్దమైతే కేసు ఎందుకు పెట్టలేదు

అబద్దమైతే కేసు ఎందుకు పెట్టలేదు

ఇదిలా ఉండగా, సెక్స్ క్లిప్ అనంతరం హార్దిక్ పటేల్ పైన మరో ఆరోపణలు వచ్చాయి. అతను స్నేహితులతో తాగుతున్న వీడియో వెలుగు చూసింది. కాగా, సెక్స్ క్లిప్‌పై బీజేపీ నేత, కేంద్రమంత్రి మంకుష్ మాండవీయ మాట్లాడారు. ఆ సెక్స్ సీడీతో తమకు సంబంధం లేదని చెప్పారు. అలాంటి చీఫ్ ట్రిక్స్‌ను బీజేపీ చేయదన్నారు. ఆ సెక్స్ క్లిప్ ఫేక్ అయితే ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+