‘పద్మావతి’ని వాయిదా వేయమంటోన్న బీజేపీ, ఎందుకంటే...
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రం గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తోన్న బీజేపీ ఈ సినిమా విడుదలను కొంతకాలం వాయిదా వేయాలని కోరుతోంది.
అహ్మదాబాద్: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రం గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తోన్న బీజేపీ ఈ సినిమా విడుదలను కొంతకాలం వాయిదా వేయాలని కోరుతోంది.
గుజరాత్‌లో వచ్చే డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో నటించిన 'పద్మావతి' చిత్రంపై గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా రాజ్‌పుత్‌లను అవమానించేలా ఉందని ఆ వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదాల నడుమ డిసెంబర్ 1న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.
అయితే, డిసెంబర్ 9, 14న గుజరాత్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుత వివాదాల నేపథ్యంలో సినిమా విడుదలైతే ఆందోళనలు జరిగే అవకాశముందని, ఆ ప్రభావం ఎన్నికలపై కూడా పడవచ్చని బీజేపీ భావిస్తోంది.
అందుకే 'పద్మావతి' సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతోంది. మరోవైపు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇంకోవైపు ఈ సినిమాను ముందు తమకు చూపించాకే విడుదల చేయాలని రాజ్‌పుత్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications