అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అసలు కారణం ఇదే..? సిమ్యులేషన్ పరీక్ష తర్వాత ..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. అయితే ఈ ఘటనపై అధికారులు జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదానికి కారణం రెండు ఇంజిన్ల వైఫల్యమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై జరిపిన సిమ్యూలేషన్ పరీక్ష ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదానికి కారణం రెండు ఇంజిన్ల వైఫల్యమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై జరిపిన సిమ్యూలేషన్ పరీక్ష ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం. ఈ పరీక్షలో అధికారులు.. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నట్లుగానే ల్యాండింగ్ గేర్ ను కిందికి దించి, రెక్కల ఫ్లాప్ లను మూసేసి పరీక్షించారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని గుర్తించినట్లు సమాచారం.
ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు.. 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరి కొంతమంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందారు.
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోవడంతో 265 మంది మృతి చెందారు.

అయితే ఇంతటి ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్ ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచాడు. అతడు 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కుప్పకూలిన ఘటనలో అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడటం విశేషం.
అయితే విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ప్రకటించింది టాటా సన్స్ సంస్థ. ఆ తర్వాత టాటా సంస్థ ఇస్తున్న రూ.కోటితో పాటు మరో రూ. 25 లక్షలు ఒక్కో కుటుంబానికి అందజేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications