నెచ్చెలి శశికళతో జాగ్రత్త: బీజేపీ హై కమాండ్, లాభం కోసం !

దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చెయ్యకూడదని, రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు బీజేపీ

చెన్నై: తమిళనాడులో అతి పెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చెయ్యకూడదని, రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలిచ్చారు.

అనారోగ్యంతో జయలలిత మృతి చెందిన రోజే తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. 2016 డిసెంబర్ 29వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

డిసెంబర్ 31వ తేదిన శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభలో 37 మంది, రాజ్యసభలో 14 మంది ఎంపీలు, రాష్ట్రంలో 135 మంది ఎమ్మెల్యేలతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే వ్యవహరిస్తున్నది.

AIADMK Ggeneral Secretary Sasikala Natajan and BJP President Amit Shah

అన్నాడీఎంకే మద్దతు మనకు కావాలని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. కేంద్రంలో ప్రత్యేక మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.

51 మంది ఎంపీలు ఉన్న అన్నాడీఎంకేతో శతృత్వం పెంచుకోరాదని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు బీజేపీ నాయకులకు చెప్పారని విశ్వసనీయ సమాచారం.

తమిళనాడులో బీజేపీకి రెండు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. మైనార్టీల ఓట్లు దూరం చేసుకోరాదని లక్షం ఉన్నందు వల్లే అన్నాడీఎంకే పార్టీ రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించగలిగింది.

ఇప్పుడు శశికళతో తగువు పెట్టుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ నేతలకు పలు సూచనలు ఇచ్చారు.

ఢిల్లీ పెద్దల ఆదేశాలతో కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందర్ రాజన్ లు అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన శశికళకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే కుండా సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+