పన్నీరుసెల్వంతో ఫోటో దిగేందుకు కత్తితో హల్‌చల్
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు.
తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. ఇది కొద్దిసేపు గందరగోళానికి దారితీసింది.
విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఫోటో దిగేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.

అయితే అతడిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువకుడు తన వద్దనున్న కత్తి తీసి భద్రతా సిబ్బందిని బెదించేందుకు ప్రయత్నించాడు.
వెంటనే స్పందించిన సిఐఎస్‌ఎఫ్ బలగాలు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించారు. అతనిని సోలైరాజన్(50)గా గుర్తించారు. అన్నాడీఎంకే కార్యకర్త.












Click it and Unblock the Notifications