రెండాకుల చిహ్నం కోసం పోటీ, నేడు డెడ్ లైన్: ధీమాతో పళని, పన్నీర్ వర్గం, అదే కారణం !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఆ పార్టీలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. సోమవారం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో హాజరైనారు. రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలంటే లేదు మాకే ఇవ్వాలని అధికారులకు మనవి చేశారు.

  శోభన్ బాబు-జయలలిత గురించి ఆసక్తికరం! శశికళ అంటేనే అసహ్యం | Oneindia Telugu

  తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోని మంత్రులు ఎంపీ. సంపత్, జయకుమార్, పార్లమెంట్ సభ్యుడు మైత్రేయన్ తదితరులు, టీటీవీ దినకరన్ తరుపన రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్, పూహళేంది తదితరులు ఎన్నికల కమిషన్ ముందు హాజరైనారు.

  AIADMKs two leaves symbol case EC hear on today

  రెండాకుల చిహ్నం మాకే వస్తుందని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు కారణం మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మా వైపే ఉన్నారని అంటున్నారు. ఆదివారం కడలూరులో జరిగిన బహిరంగ సభలో హోర్డింగ్ ల మీద రెండాకుల చిహ్నం వెయ్యడం చూస్తుంటే పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం మరింత ఉత్సాహంగా ఉందని తెలిసింది.

  సోమవారం రెండాకుల చిహ్నం ఎవరికో ఒకరికి కేటాయించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ ముందు రెండు వర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి. రెండాకుల చిహ్నం సొంతం అయిన వెంటనే తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్సి సంబరాలు చేసుకోవడానికి రెండు వర్గాలు సిద్దంగా ఉన్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Election Commission hearing on the case of which AIADMK faction should be allowed to be use the ‘two leaves’ party symbol.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి