థర్డ్ ఫ్రంట్ నుంచి ఇంకో లిస్ట్: ఎవరికి ఎర్త్ పెడుతుందో గానీ..!!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. థర్డ్ ఫ్రంట్ గా రంగంలోకి దిగింది అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మొత్తం 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఆయా నియోజకవర్గాల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో అయిదు చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయి. దశలవారీగా మిగిలిన అభ్యర్థుల పేర్లను విడుదల చేయనుంది. మొత్తం 16 జిల్లాల్లో 32 నియోజకవర్గాలతో కూడిన జాబితా ఇది.

థర్డ్ ఫ్రంట్ గా ఎన్నికల బరిలో దిగడం.. ముస్లింల ఓటుబ్యాంక్ భారీగా చీలుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది.. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహాకూటమిని దెబ్బ కొట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో- ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. మెజారిటీ స్థానాల్లో మహాకూటమికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారి గెలుపోటములను ఎంఐఎం తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

aimim-unveils-25-candidates-for-bihar-assembly-elections

మహాకూటమిలోకి చేరడానికి ఎంఐఎంకు ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన 'ఆజాద్ సమాజ్ పార్టీ', స్వామి ప్రసాద్ మౌర్యకు చెందిన 'అప్నీ జనతా పార్టీ'తో జతకట్టారు. తాజాగా ఎన్నికల బరిలో దిగబోయే అభ్యర్థుల జాబితాను ఎంఐఎం విడుదల చేసింది. 25 మంది అభ్యర్థుల పేర్లను పొందుపరిచిన లిస్ట్ ఇది. అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజకవర్గాలు ఖరారయ్యాయి.

అమౌర్ నియోజకవర్గం నుండి అఖ్తరుల్ ఇమాన్ పోటీ చేస్తున్నారు. బలరాంపూర్- ఆదిల్ హసన్, ధాకా- రాణా రంజిత్ సింగ్, నార్కటియా- షమిముల్ హక్, గోపాల్‌గంజ్- అనాస్ సలామ్, జోకీ హట్- ముర్షిద్ ఆలం, బహదూర్‌గంజ్- తౌసీఫ్ ఆలం, ఠాకుర్‌గంజ్- గులాం హస్నైన్, కిషన్‌గంజ్- అడ్వొకేట్ షామ్స్ ఆగజ్, బైసి- గులాం సర్వార్, షేర్‌ఘాటి- షాన్ ఎ అలీ ఖాన్, నాథ్ నగర్- మహ్మద్ ఇస్మాయిల్.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సివాన్- మహ్మద్ కైఫ్, కియోటి- అనిసూర్ రెహ్మాన్, జలే- ఫైజల్ రెహ్మాన్, సికంద్రా- మనోజ్ కుమార్ దాస్, ముంగేర్- డాక్టర్ మునాజిర్ హసన్, నవాడా- నసీమా ఖాతూన్, మధుబని- రషీద్ ఖలీల్ అన్సారీ, దర్భంగా రూరల్- మహ్మద్ జలాల్, గోరాబోరా- అఖ్తర్ షెహన్‌షా, కస్బా- షాహనవాజ్ ఆలం, అరారియా- మహ్మద్ మన్సూర్ ఆలం, బరారీ- మతియుర్ రెహ్మాన్ షేర్‌షాహాబాది, కోచాధామన్- సర్వార్ ఆలం ఎన్నికల బరిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+