ఎయిర్ ఫోర్స్ కొత్త ఛీఫ్ గా ఎయిర్ ఛీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నాలుగు దశాబ్దాల అనుభవశాలి...

ఎయిర్ ఛీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఇవాళ 27వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఛీఫ్ ఆర్కేఎస్ బహదూరియా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం వీఆర్ చౌదరిని తాజాగా భారత వాయుసేనకు అధిపతిగా నియమించింది. దీంతో ఆయన ఇవాళ ఢిల్లీ వాయు భవన్ లో అధికార లాంఛనాలతో బాధ్యతలు తీసుకున్నారు.

ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ బహదూరియా ఇవాళ రిటైర్ కానుండటంతో ఆయన స్ధానంలో కొత్త ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ గా వివేక్ రామ్ చౌదరిని నియమిస్తూ కేంద్రం నిన్న ఓ ప్రకటన చేసింది. వాస్తవానికి ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ తో పాటు త్రివిధ దళాల్లో అధిపతుల నియామక ప్రకటనలు రెండు నెలల ముందే వెలువడుతుంటాయి. కానీ ఈసారి మాత్రం కేంద్రం విఆర్ చౌదరి నియామకంపై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది.

Air Chief Marshal VR Chaudhari takes charge as 27th Airforce Chief in Vayu Bhavan

ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి డిసెంబర్ 29, 1982 న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. ఆపరేషన్ మేఘా దూత్ జరిగిన సమయంలో ప్రయాణించిన మిషన్లతో సహా అనేక రకాల ఫైటర్, ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఆయనకు 3800 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. ఆపరేషన్ సేఫెడ్ సాగర్ లోనూ చౌదరి పాల్గొన్నారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్టన్ పూర్వ విద్యార్థి కూడా.

ఎయిర్ వైస్ మార్షల్‌గా, ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిప్యూటీ కమాండెంట్‌గా కూడా వీఆర్ చౌదరి గతంలో పనిచేశారు. ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్ అసిస్టెంట్ చీఫ్ (ఎయిర్ డిఫెన్స్), ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్ (పర్సనల్ ఆఫీసర్స్) నియామక అధికారిగా కూడా చౌదరి పనిచేశారు. అంతే కాదు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ మరియు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన నియామకాలను నిర్వహించారు. చౌదరి జూలై 1, 2021 న వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా వ్యవహరించారు.

Air Chief Marshal VR Chaudhari takes charge as 27th Airforce Chief in Vayu Bhavan

ప్రస్తుత త్రివిధ దళాధిపతుల్లో నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నవంబర్ చివరలో పదవీ విరమణ చేయనున్నారు ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే మాత్రం ఏప్రిల్ 2022 వరకు సర్వీసులో ఉండబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+