వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన మిగ్-21 బైసన్ విమానం: ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ మృతి

|
Google Oneindia TeluguNews

భోపాల్: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

 వామ్మో.. నడిరోడ్డుపై, కారులో వెళ్తుండగా.. కూలిన విమానం, మంటలు.. ఇద్దరు మహిళలు వామ్మో.. నడిరోడ్డుపై, కారులో వెళ్తుండగా.. కూలిన విమానం, మంటలు.. ఇద్దరు మహిళలు

ఈ విమాన ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారులు ధృవీకరించారు. గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించడం పట్ల వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.

Air Force Pilot Killed In MiG-21 Bison Accident During Training Mission

కాగా, గత 18 నెలల్లో మిగ్ 21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2019 సెప్టెంబర్ నెలలో ఇదే ఎయిర్ బేస్ లో మిగ్ 21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల కారణంగా విమానానులను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా భారత్ కోల్పోవడం జరుగుతోంది.

English summary
Air Force Pilot Killed In MiG-21 Bison Accident During Training Mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X